Sports

ప్రపంచ క్రికెట్ లో ఆ ఇద్దరే నా ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లు: కోహ్లి

ప్రపంచ క్రికెట్ లో ఆ ఇద్దరే నా ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లు: కోహ్లి

అతనే ఒక గోట్‌(గేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌).. అయితే అతను అభిమానించే, ఆరాధించే గొప్ప క్రికెటర్లు కూడా ఉన్నాడు. మరి ఇప్పటికే గోట్‌ ట్యాగ్‌ పొందిన కోహ్లీకి గోట్స్‌ ఎవరో బయటపెట్టాడు..

టీమిండియా మాజీ కెప్టెన్‌, రన్‌ మెషీన్‌, చేజ్‌ మాస్టర్‌ విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లలో గొప్ప క్రికెటర్‌గా కీర్తిప్రతిష్టతలు అందుకుంటున్నాడు. 2008 అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ గెలిచిన కెప్టెన్‌గా భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన కోహ్లీ.. ఒక సునామీలా ఇండియన్‌ క్రికెట్‌ను చుట్టేశాడు. దాదాపు 14 ఏళ్లు పైబడిన కెరీర్‌లో కోహ్లీ ఒక్కసారి కూడా జట్టు నుంచి ఉద్వాసనకు గురి కాలేదు. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన మొదలు.. పరుగుల వరద పారిస్తూ.. రన్‌ మెషీన్‌గా పేరుతెచ్చుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని వారుసుడిగా టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.

ఆటగాడిగా అనేక శిఖరాలను అందుకున్న కోహ్లీ.. కెప్టెన్‌గా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో టీమిండియాను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఐసీసీ ట్రోఫీ గెలవలేదనే అపవాదు తప్పితే.. కెప్టెన్‌గా కోహ్లీపై ఎలాంటి మచ్చా లేదు. సౌరవ్‌ గంగూలీ తర్వాత టీమిండియాకు దొరికిన మరో అగ్రెసివ్‌ కెప్టెన్‌గా కోహ్లీ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే.. కెప్టెన్సీ భారంతో తన బ్యాటింగ్‌పై ప్రభావం పడుతుందని భావించిన కోహ్లీ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత తిరిగి ఫామ్‌లోకి వచ్చి.. మునుపటి కోహ్లీని చూపిస్తున్నాడు. తాజాగా ఐపీఎల్‌ 2023 కోసం సిద్ధం అవుతున్న కోహ్లీ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు.

ప్రస్తుతం ఉన్న యువ క్రికెటర్లు కానీ, క్రికెట్‌ అభిమానులకు కానీ.. ‘గోట్‌’(జీఓఏటీ) గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ ఎవరూ అంటే విరాట్‌ కోహ్లీ పేరు చెబుతుంటారు. కానీ.. కోహ్లీకి ఆల్‌ టైమ్‌ గ్రేట్స్‌ ఎవరో తెలుసా.. క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌, విండీస్‌ దిగ్గజం వీవ్‌ రిచర్డ్స్‌. క్రికెట్‌ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన పేర్లవి. వాళ్లిద్దరు తన ఆల్‌టైమ్‌ గ్రేట్స్‌ అంటూ కోహ్లీ ప్రకటించాడు. అయితే.. ఇండియన్ క్రికెట్‌లో సచిన్‌ తర్వాతి స్థానం కోహ్లీదే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. టన్నుల కొద్ది పరుగులు.. సెంచరీల విషయంలోనూ అంతర్జాతీయ స్థాయిలో సచిన్‌ తర్వాతి స్థానంలో కోహ్లీనే ఉన్నాడు. ఏ లెక్కన చూసుకున్నా.. భారత క్రికెట్‌కు సచిన్‌ తర్వాత కోహ్లీనే అని క్రికెట్‌ అభిమానులు సైతం పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.