NRI-NRT

NATS. వైజాగ్ లో ఉల్లాసంగా జానపద సంబరాలు..

NATS. వైజాగ్ లో ఉల్లాసంగా జానపద సంబరాలు..

ఉల్లాసంగా నాట్స్ జానపద సంబరాలు

విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) , గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ ( గ్లో) మరియు మాతా కళా పీఠం వారు సంయుక్తంగా నిర్వహించిన జానపద సంబరాలు ఆద్యంతం ఆహుతులను ఆలరించింది. జముకు వాయిద్యంతో అసిరయ్య పాడిన జానపద పాటలు, రఘు బృందంచే తెలుగు జానపద గీతం నృత్యాలు, స్నేహాంజలి బృందం చే దింసా నృత్యం, ప్రముఖ వైద్యులు ఆత్మీయ అతిథి డాక్టర్ పెదవీర రాజు గారు తెలుగు పదం తెలుగు పద్యం మీద మాట్లాడిన మాటలు అందరిని కట్టిపడేసింది. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో , జన్మభూమి కి కూడా సేవ చేయాలనే తలంపుతో జానపద కళ ని విస్తృతంగా ముందుకు తీసుకు వెళ్ళే భాగంగా , వారికి గుర్తింపునిచ్చి తగు పారితోషకము ద్వారా ఇటువంటి కలలని అంతరించిపోకుండా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహించామని అని ప్రవాస ఆంధ్రుడు నాట్స్ కన్వీనర్ అప్పసాని శ్రీధర్ తెలిపారు.


నాట్స్ ద్వారా జరుగుతున్నటువంటి పలు సామాజిక కార్యక్రమాలు అటు అమెరికాలోనూ ఇక్కడ సంయుక్త తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలను వివరిస్తూ న్యూ జెర్సీలో మే 26 నుంచి 28 వరకు జరగబోయే నాట్స్ కన్వెన్షన్ కి ఆహ్వానం పలికారు ప్రస్తుత నాట్స్ అధ్యక్షులు నూతి బాపు సభాధ్యక్షులు రైటర్స్ అకాడమీ చైర్మన్ శ్రీ వివి రమణమూర్తి గారు మాట్లాడుతూ ఇటువంటి జానపద కళలను ప్రోత్సహిస్తున్నటువంటి సంస్థలు ఎంతో అభినందనీయమని అన్నారు. తెలుగు భాషా కోవిదులు మీగడ రామలింగస్వామి నాటక రంగంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్ల గోపాలం లను సన్మానించారు,.కళా హృదయులు ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు గ్లో కార్యదర్శి వెంకన్న చౌదరి,శ్రీ మాతా కళా పీఠం నిర్వాహకులు పల్లి నాగభూషణం, బి. న్.మూర్తి ఆనందం వెలిబుచ్చారు.