Movies

పవన్ మూవీలో కీలక రోల్ లో నటించనున్న విలక్షణ నటుడు ?

పవన్ మూవీలో కీలక రోల్ లో నటించనున్న విలక్షణ నటుడు ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అతి త్వరలో సుజీత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న మూవీ ఓజి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 15 నుండి రెగ్యులర్ షూట్ ప్రారంభించి దాదాపుగా రెండు నెలల పాటు వేగంగా బ్రేక్స్ లేకుండా కొనసాగించేలా యూనిట్ పక్కాగా ప్లాన్ చేస్తోందట.

ఎస్ థమన్ సంగీతం అందించనున్న ఈ మూవీలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇక తొలిసారిగా తనకు ఇష్టమైన పవర్ స్టార్ తో చేస్తున్న మూవీ కావడంతో కథ, కథనాల విషయమై దర్శకుడు సుజీత్ పక్కాగా కేర్ తీసుకుంటున్నారట. కాగా ఈ ప్రతిష్టాత్మక ఈ మూవీకి సంబందించిన మరిన్ని అప్ డేట్స్ అతి త్వరలో వరుసగా రానున్నాయి.