DailyDose

TNI. నేటి నేర వార్తలు..

TNI. నేటి నేర వార్తలు..

* రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు నిచ్చిన తెనాలి ఆర్యవైశ్య సంఘం నేత రాకేష్

నిన్న తెనాలి కౌన్సిల్ సమావేశం లో టీడీపీ కౌన్సిలర్ ఆర్యవైశుడు యుగంధర్ పై దాడికి నిరసనగా నేడు తెనాలిలో ర్యాలీ

రాజకీయ రంగు కాకుండా కుల రంగు పుసుకున్న తెనాలి మున్సిపల్ సమావేశ రగడా

పార్టీలకు ఆతీతంగా మద్దత్తుగా ఆర్యవైశ్యలు

ర్యాలీ ని అడ్డుకున్న పోలీసులు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య సంఘ నేతలు, టీడీపీ నేతలు

నిన్న విచక్షణ మరిచి గౌరవంగా ఉండాల్సిన సభలో కేవలం తాను ఆర్యవైశ్య కులంకు చెందిన వాడిని కాబట్టే దాడికి పునుకున్నారని ఆరోపణలు చేసిన యుగంధర్

తప్పు చేసిన వారిని వదిలి తమ వారిపై చర్యలు తీసుకుంటారా అంటు పోలీసులపై ప్రశ్నల వర్షం

యుగంధర్ పై దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేకపోతే తమ దీక్ష అపేది లేదని ఆర్యవైశ్య సంఘ నేత రాకేష్ స్పష్టీకరణ.

అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఆర్యవైశ్యలు ఏకతాటిపై నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు

వారికి మద్దత్తుగా టీడీపీ, బిజేపి, వైసీపీ, ఇతర పార్టీలలోని ఆర్యవైశ్య సంఘం నేతలు దీక్ష శిబిరం వద్దకు

రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యలు పై జరుగుతున్న దాడులకు నిన్న దాడికి నిరసనగా అమర నిరాహారదీక్ష చేస్తున్నట్టు తెలిపిన రాకేష్

కన్యకపరమేశ్వరి దేవస్థానంలో నిరసన చేస్తున్న రాకేష్ వర్ధకు వచ్చిన మాజీమంత్రి ఆలపాటి. రాజేంద్ర ప్రసాద్, టీడీపీ మహిళ అధ్యక్షురాలు అన్నబత్తుని జయలక్ష్మి

* TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు.. బోర్డు సభ్యుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేయనున్న సిట్‌ అధికారులు

*హైదరాబాద్: వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ఫైర్ శాఖ సిద్ధంగా ఉంది.. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ సమయంలోనే ఫైర్ నిబంధనలు ఉంచుకోవాలి-తెలంగాణ రాష్ట్ర ఫైర్ డీజీ నాగిరెడ్డి

*పెరుగుతున్న కరోనా కేసులు

శంషాబాద్ విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు

దేశంలో వరుసగా రెండో రోజు 3 వేల మార్కును చేరిన కొత్త కేసులు

ఒక్క మహారాష్ట్రలోనే 700 కేసుల నమోదు

శంషాబాద్ విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటు

అనుమానిత ప్రయాణికులకు పరీక్షలు

హైదరాబాద్ : కరోనా వైరస్ ఇక ఖతమైనట్టేనని భావిస్తున్న వేళ దేశంలో పెరుగుతున్న కేసులు మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు పదుల సంఖ్యలో నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ వేలల్లోకి చేరాయి. నిన్న వరుసగా రెండో రోజు కేసులు 3 వేల మార్కును దాటింది. ఒక్క మహారాష్ట్రలోనే దాదాపు 700 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానాశ్రయంలో మళ్లీ కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రయాణకులను పరీక్షించేందుకు థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వందమంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్లే వారికి మాత్రం కరోనా పరీక్షలు, ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదన్నారు. అయితే, కరోనా లక్షణాలున్నట్టు అనిపిస్తే మాత్రం మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

* డేటా లీక్‌ కేసులో కీలక మలుపు 66 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన వ్యక్తి అరెస్టు , 24 రాష్ట్రాల్లో 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ ఫరీదాబాద్‌కు చెందిన వినయ్‌ భరద్వాజ్‌ను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
6 మెట్రోపాలిటిన్ సిటీల్లో 4.5 లక్షల ఉద్యోగాలను నియమించుకున్న భరద్వాజ్
డీమార్ట్‌, నీట్, పాన్‌కార్డ్‌, క్రెడిట్ కార్డ్‌, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్..
ఇన్‌కంట్యాక్స్‌, డిఫెన్స్‌కు సంబంధించిన అధికారుల డేటా చోరీ 9, 10, 11, 12 తరగతుల విద్యార్థుల డేటా కూడా చోరీ జీఎస్టీ, ఆర్టీవో, అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌ , పేటీఎం, ఫోన్‌ పే, బిగ్‌ బాస్కెట్‌..

బుక్‌ మై షో, ఇన్‌స్టాగ్రామ్‌, జోమాటో, పాలసీ బజార్ల నుంచి డేటా చోరీ బై జ్యూస్‌, వేదాంత సంస్థల డేటా లీక్..

* ప్రమాదంలో ప్రజాస్వామ్యం

కేంద్రంలో ఉన్మాద ప్రభుత్వం నడుస్తోంది
భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు

విజయవాడ, ఏప్రిల్1: బీజేపీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్రరావు అన్నారు. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఉన్మాద మనస్తత్వం కలిగిన ఒక ప్రభుత్వాన్ని మనం ఎదుర్కొంటున్నామని చెప్పారు. మన దేశ అప్పులు లక్షల కోట్లు పెరుగుతుంటే అదానీ ఆస్తులు మాత్రం భారీగా పెరుగుతున్నాయని అన్నారు. అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణిస్తున్నారని, ఒక పెద్ద అవినీతిపరుడిని ప్రశ్నిస్తే దేశ ద్రోహం అవుతుందా అని అడిగారు. అదానీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి వాటా వెళ్తోందని ఆరోపించారు. కేంద్రంలో ఉన్మాద ప్రభుత్వం నడుస్తోందని తద్వారా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్రంలో కేవలం పెట్టుబడిదారులు రక్షించేందుకు చూస్తున్నారని, అలానే అవినీతిపరుదుని రక్షించేందుకు చూస్తున్నారన్నారు. అదాని, మోడి అవిభక్త కవలలు కావడంతో ఆదాని సంపద ఎన్నో రెట్లు పెరుగుతోందన్నారు. భారతదేశం మాత్రం అప్పుల్లో కురుకుపోతుంటే అదానీ ఆదాయం మాత్రం నాలుగింతలు పెరుగుతుందన్నారు. అక్రమార్జన చేస్తున్న అదానీ ద్వారా మోడీకి వాటా అందుతుందని ఆయన ఆరోపించారు. దేశంలో వారు చేస్తున్న అవినీతిని ప్రశ్నించడానికి సిద్దమైన రాహుల్ ని వేధింపులకు గురిచేయడం శోచనీయమన్నారు.
మోడీ ప్రభుత్వం నిత్యం అవినీతిపై పనిచేస్తోంద న్నారు. ఇదేమిటని అవినీతిపై అదానీని ప్రశ్నిస్టే దేశద్రోహం కింది పెడుతున్నారన్నారు. మోడీ అదాని చేసే అవినీతిని ప్రశ్నించిన ఎంపీ రాహుల్ గాంధీ పైన దేశద్రోహం నింద మోపడం సమంజసం కాదన్నారు. కేవలం కుంటిసాకు వెతికి రాహుల్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగ పాఠాన్ని పార్లమెంటు స్పీచ్ నుంచి తొలగించడం అప్రజాస్వామికమైన చర్యగా ఆయన అభివర్ణించారు. పార్లమెంటు సభ్యుడిని అనర్హునిగా ప్రకటించాల్సిన వ్యక్తి రాష్ట్రపతి కాగా అలా జరగకుండానే రాహుల్ ని అనర్హునిగా ప్రకటించడం ఇంతవరకూ ఎప్పుడూ జరగలేదని ఇక ఎప్పుడు కూడా ఇలా జరగకూడదని అన్నారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే కాపీ కూడా అందకుండా రాహుల్ పై అనర్హత వేటు వేయడం వంటి చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారని,చరిత్రలో ఎపుడు జరగలేద న్నారు. దేశం కోసం వారి సొంత ఆస్తులను త్యాగం చేసిన మోతీలాల్ వారసులు నెహ్రూ కుటుంబమైన రాహుల్ గాంధీకి ఢిల్లీలో సొంత ఇల్లు కూడా లేదని చెప్పారు. పార్లమెంట్ సభ్యుడు కి కేటాయించిన ఇల్లు కూడా ఖాళీ చేయాలని ఆదేశించడం చూస్తుంటే ఇది ఎంత అప్రజాస్వామికమైన చర్యో అవగతం అవుతుందన్నారు.

ఏపీ నుంచి స్పందనలేకపోవడం సిగ్గుచేటు

గత ఇరవై ఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న సీనియర్ పార్లమెంటు సభ్యులు రాహుల్ పై అనర్హత వేటు వేస్తే ఏ పి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటని కేవీపీ అన్నారు. ప్రజాస్వామ్యం పై ఇంత దారుణంగా దాడి జరుగుతున్నా ఏ.పి.నేతలు ఎందుకు మోనంగా ఉన్నారో అర్ధం కావడం లేదన్నారు. అందుకు వైసీపీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అందువల్లే వారు బీజేపీని ప్రశ్నించలేకపోతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీకి జరిగే నష్టం ప్రజాస్వామ్య పై జరిగే దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం దేశం ప్రమాదంలో ఉందని దాన్ని రక్షించు కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేంద్రంలో ఫాసిస్ట్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే అరాచకాల‌‌ను ఏపీ మినహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాయని చెప్పారు.

ప్రశ్నించే పవన్ ఎక్కడ

కేవలం ప్రశ్నించడానికే వచ్చానన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు ఆపార్టీతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా మాట్లాడకపోవడం గమనించదగ్గ పరిణామమే అన్నారు. ఏపీ రాజకీయాలపై ప్రశ్నించే వ్యక్తి పవన్ కూడా నేడు కేంద్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాహుల్ విషయంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇక ఇపుడు ఆయన ప్రశ్నించకపోతే భవిష్యత్ లో ఏమి మాట్లాడే అవకాశం ఉండదన్నారు.

చంద్రబాబు మౌనమేల

కేంద్రంలో చక్రాలు తిప్పాను అని చెబుతూ ఎన్డీఏకి సారధ్యం వహించిన చంద్రబాబు నేడు రాహుల్ గాంధీకి జరిగిన అన్యాయం పై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని దెప్పిపొడిచారు. ఏపీలో జరిగే అన్ని అంశాలపై మాట్లాడే బాబు రాహుల్ గాంధీ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబుకు చట్టాలపై గౌరవం ఉంటే కేంద్ర చర్యలపై నిలదీయాలన్నారు. ఈ విషయంలో చంద్రబాబు బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడటానికి ముందుకు రావడం లేదన్నారు. ప్రజాస్వామ్యం పడకేస్తున్న ఈ సమయంలోచంద్రబాబు ఢిల్లీ వెళ్లి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అందుకు బాబు మాత్రమే అర్హుడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తో టీడీపీ కలిసి పోటీచేయడాని తాను వ్యతిరేకించిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అయితే నేడు రాజీవ్ గాంధీకి జరిగిన అన్యాయం విషయంలో ఇప్పుడు కేంద్రం ప్రశ్నిస్తే టీడీపీతో కలిసి పనిచేయడానికి తాను సిద్దంగా ఉన్నానని తెలిపారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్, ఉపాధ్యక్షులు కె జయరాజ్, విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆర్ వసంత్ తదితరులు ఉన్నారు.

జగన్ కు ఎందుకు దూరంగా ఉంటున్నానో త్వరలోనే చెబుతా : కేవీపీ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆత్మ బంధువుగా పేరుగాంచిన వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కేవీపీ తన అల్లుడిగా భావించే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాత్రం దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన దీనిపై స్పందిస్తూ వైఎస్ కు దగ్గరగా ఉన్న తాను జగన్ కు దూరంగా ఎందుకు ఉంటున్నాననే విషయం గురించి త్వరలోనే చెపుతానని అన్నారు. ఇప్పుడే దీనిపై మాట్లాడనని, కానీ ఎప్పటికైనా ఈ విషయం గురించి మాట్లాడాల్సిందేనని, మరో రోజు మీడియా ముఖంగా అన్ని విషయాలను వివరిస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

*చిత్తూరు జిల్లా
పలమనేరు నియోజకవర్గం
గంగవరం మండలం

మైనర్ విద్యార్థినిని నమ్మించి బలవంతపు పెళ్లి చేసుకున్న లెక్చరర్

లెక్చరర్ పై ఫోక్సో కేసు నమోదు చేసిన గంగవరం పోలీసులు

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువే.. తప్పుడు మార్గం పట్టాడు. కామాంధుడిగా మారి..ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి బలవంతపు పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతడికి పెళ్లయి, ఓ కుమార్తె కూడా ఉంది. అధ్యాపక వృత్తికే కళంకం తీసుకొచ్చిన ఆ ప్రబుద్ధుడి గురించి పోలీసులు తెలిపిన ప్రకారం.. గంగవరం మండలానికి చెందిన చలపతి (33) శ్రీ వాణి కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే 17 ఏళ్ల విద్యార్థినితో చనువుగా ఉంటూ వచ్చాడు. మాయమాటలు చెప్పాడు. బుధవారం రోజున చివరి పరీక్ష రాసి బయటకు వస్తున్న ఆ విద్యార్థినిని నమ్మించి తిరుపతికి తీసుకెళ్ళాడు. తాను నిజాయితీపరుడని, తనను నమ్మితే సంతోషంగా చూసుకుంటానని మాయమాటలు చెప్పాడు. అక్కడే ఓ ఆలయంలో పెళ్లికూడా చేసుకున్నాడు. కొద్దిసేపటికి లెక్చరర్ చలపతి నిజస్వరూపాన్ని ఆమె గమనించింది. అతడి మాటలకు పొంతన లేకపోవడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి గురువారం రాత్రి గంగవరం పోలిస్ స్టేషన్కు చేరుకొంది. లెక్చరర్ మాయమాటలు చెప్పి మోసంచేశాడని తల్లిదండ్రుల వద్ద విలపించింది. బాలికతోపాటు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లెక్చరరు చలపతిపై ఎస్ఐ సుధాకర్ రెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి చేసి కోర్టుకు హాజరు పరచినట్లు ఎస్ఐ తెలిపారు.

* అమరావతి
కృష్ణా నది లో ఇద్దరు యువకులు మృతి

అమరావతి పరిధిలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఈత కొడుతూ మునిగిపోయి ఇద్దరు యువకులు మృతి..

చనిపోయిన వారికి సంబంధించి 75 తాళ్లూరు కు చెందిన వారిగా సమాచారం..