*తెనాలిలో కౌన్సిలర్ యుగంధర్‍ను పరామర్శించిన టీడీపీ నేతలు ఆలపాటి రాజా, కన్నా లక్ష్మీనారాయణ – వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కన్నా లక్ష్మీనారాయణ – పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు – ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు : కన్నా లక్ష్మీనారాయణ
*తిరుపతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నాగరాజు హత్య కేసులో ఒకరు అరెస్ట్.. రిప్పుంజయను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు.. నిందితులు చాణక్య, గోపి, మరో ముగ్గురు పరారీ
#AndhraPradesh #Tirupati #SoftwareEngineer
*
గుడివాడ
గుడ్ మెన్ పేట జాకబ్ మెమోరియల్ చర్చ్ ప్రక్కన పిడుగు పడినది. త్రుటిలో క్రికెట్ అడుచున్న పిల్లలు తప్పించుకున్నారు.
*
ఎన్టీఆర్ జిల్లా :
తిరువూరు పట్టణంలోని విజయవాడ జాతీయ రహదారిపై ఆర్ఆర్ గ్రాండ్ సమీపంలో రోడ్డు ప్రక్కన నిలిచి ఉన్న బైక్ ను డీ కొన్న మరో మోటార్ సైకిల్..
ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు..
*
విజయవాడ జాతీయ రహదారిపై గండిగుంట ప్లైఓవర్ బ్రిడ్జి పై వేగంగా వచ్చి కారును ఢీకొన్న స్కూటీ, స్కూటీ నడుపుతున్న వ్యక్తి ప్రమాద ఘటనలో మృతి.
స్కూటీ నడుపుతున్న వ్యక్తి రాంగ్ రూట్లో రావడం జరిగిన ప్రమాదం
*ప్రెస్ నోట్,
ది 2-4-2023,
విశాఖపట్నం.
******
శుభాష్ పై పోలీస్ చర్యలను న్యాయవాద సంఘాలు ప్రతిఘటించాలి.
రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా భావించాలి.
————-
మేడా శ్రీనివాస్,
ఖండన, ఆలా (ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ )
————-
రాజమండ్రిలో యువ న్యాయవాది దుగ్గిరాల శుభాష్ పై పోలీసుల అమానుష దాడిని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు.
ఉన్నత న్యాయస్థానాలు, పోలీస్ ఉన్నత అధికారులు సామాన్యుల పట్ల
ఏ విధంగా విధులు నిర్వహించాలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కొంతమంది పోలీసుల అత్యుత్సాహం పోలీస్ శాఖకు అపకీర్తిని తెచ్చిపెడుతుంది. రాజమండ్రిలో అనేక ప్రజా సమస్యలపై రాజమండ్రి న్యాయవాదులు కీలక పాత్ర వుంది. ప్రజా ప్రతినిధుల గెలుపులోనూ న్యాయవాదుల కృషి ఎంతో వుంది .అలాంటిది అన్యాయంగా ఒక యువ న్యాయవాది సుభాష్ పై విచక్షణా రహితంగా లాఠీ జులిపించిన బాధ్యులైన పోలీస్ లపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఇప్పటి వరకు నోరు మెదపక పోవటం బాధాకరం.
కొన్ని రాజకీయ పార్టీల సౌలభ్యం కోసం రాజమండ్రి బార్ అసోసియేషన్ విధులు బహిష్కరించి
ఆ పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నా రాజమండ్రి బార్ అసోసియేషన్ సొంత సభ్యులపై జరిగిన దాడి ఘటనలో రాజమండ్రి బార్ సరైన రీతిలో స్పందించ లేకపోతున్నదని, రాజమండ్రిలో న్యాయవాదుల భద్రతపై న్యాయవాదుల సంఘం నుండి పటిష్టమైన కార్యాచరణ సిద్ధం చేయకపోవడం శోచనీయం.
ఇప్పటి వరకు రాజమండ్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసనలు వ్యక్తం చేసిన ఘటనల్లో అత్యధిక శాతం న్యాయవాదుల సమస్యలు కాకపోవటం విస్మయానికి గురిచేస్తుంది.
ఇప్పటికే న్యాయవాదులకు ప్రత్యేక భద్రతా చట్టం అమలు చేయాలని, న్యాయవాదుల ప్రధాన సమస్యల పట్ల
ఆలా గౌ అధ్యక్షులు శ్రీ ఎస్ ఆర్ సంకు , అధ్యక్షులు శ్రీ ఎంవి రాజారామ్ గారి ఆధ్యర్యంలో తీవ్రంగా కృషి చేస్తున్నట్టు ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసారు.
సుభాష్ పై జరిగిన దాడి రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రతిష్టగా భావించి బాధ్యులపై శాఖా పరమైన చర్యలు చేపట్టే వరకు, వారిని విధుల నుండి సస్పెండ్ చేసే వరకు ఒక బలమైన కార్యాచరణకు పిలుపు నివ్వాలని ఆలా ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ రాజమండ్రి బార్ అసోసియేషన్ ను కోరారు.