* విజయవాడ : ఈ నెల 4న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం
– కడప జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న హత్యకు ప్రధాన కారకులైన వారిని అరెస్టు చేసి.. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ
– సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలోనే ఒక దళిత అధికారి హత్యకు గురైతే.. హత్యకు ప్రోద్బలించిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ పై చర్యలు తీసుకోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారు : రామకృష్ణ
– ఈమేరకు అన్ని రాజకీయ పార్టీలతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల సంఘాల నేతలతో ఈ నెల 4వ తేదీన విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
* ఎమ్మెల్యేల్లో టెన్షన్ టెన్షన్..?
ఏప్రిల్ 3న ఏం జరగనుంది..?
సీఎం సంచలన నిర్ణయం తీసుకుంటారా?
ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ఎమ్మెల్యే టెన్షన్ టెన్షన్ పెరుగుతోంది.
ఢిల్లీ పర్యటనలో ఉండగానే.. అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారా..?
ఇంత సడెన్ గా ఎందుకు మీటింగ్ ఫిక్స్ చేశారు..
ఏప్రిల్ 3వ తేదిన ఎమ్మెల్యేలు, కోర్డినేటర్లకు ఏం చెప్పనున్నారు.
ఎమ్మెల్యేలు, రిజనల్ కోర్డినేటర్లు అందరూ తప్పక హాజరుకావాలని సీఎం చెప్పడంతో.. ఆయన ఏదో చెప్పబోతున్నారన భావిస్తున్నారు.
కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ఎవరిపైనా వేటు వేసే విషయం చెబుతారా.. లేక ఎన్నికలకు సమయం ఎక్కవ లేకపోవడంతో.. సీట్లు ఎవరికి ఇవ్వడం లేదన్నదానిపై క్లారిటీ ఇస్తారా…?
ఇటీవల ఏమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి..
అలాగే వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రలోభాల పర్వంపై ఆరోపణలు…
ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏం చెబుతారు అనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.
సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.
ఫిబ్రవరి 13న చివరిసారిగా ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ అయ్యారు.
ఆ తర్వాట పార్టీలో కీలక మార్పులు జరిగాయి.
ఇక, ఏప్రిల్ లో జరిగే సమావేశం ద్వారా నేతల పనితీరుపై సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
అంతేకాదు ఎన్నికలు ఎప్పుడుంటాయి..
టికెట్లు ఎవరికి ఇస్తారు అన్నదానిపైనా అధినేత క్లారిటీ ఇస్తారని సమాచారం..
ఈసారి సమావేశంలో ఎవరి భవిష్యత్తు ఏంటి అనే దానిపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల పనితీరుపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు పార్టీ నేతలు.
ఇక ఈ నెల 18 నుంచి 26వరకు జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ నిర్వహించాలని తొలుత భావించారు.
అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆ కార్యక్రమం వాయిదా పడింది.
దీంతో వచ్చే నెల రెండో వారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించే అవకాశం ఉంది.
దీన్ని ఎలా నిర్వహించాలి అనే దానిపై కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.
జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ ద్వారా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం అందించిన పాలన, అభివృద్ధి, సంక్షేమం, పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరించేలా ప్రభుత్వం ముందుకెళ్లనుంది.
ఇప్పటికే సుమారు 8వేల సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది.
ఇక మిగిలిన సచివాలయాల్లో కూడా త్వరితగతిన కార్యక్రమం పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించినట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీకి ఊహించని ఫలితాలు ఎదురవడంతో ఈసారి సమావేశంలో అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.
ఎందుకంటే పలుసార్లు చాలామంది ఎమ్మెల్యేలకు పని తీరు మెరుగు పరుచుకోవాలని హెచ్చరికలు చేస్తారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రతో పాటు తూర్పు, పశ్చిమ రాయలసీమల్లో వైసీపీ ఘోరంగా ఓడింది.
దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు…
అంతేకాదు ముందస్తు ఎన్నికలపైనా ఏదైనా సమాచారం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
అన్నిటికన్నా ముఖ్యంగా తమను ప్రలోభాలు పెట్టారని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.
అయితే ముందే తమకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని.. చెబితే పరిస్థితి వేరాలా ఉండేది కదా అని.. జగన్ నేతనలు ప్రశ్నించే అవకాశం ఉందని సమాచారం.
నిఘా వర్గాలపై సీరియస్ అయ్యారు…
నారా లోకేష్ పాదయాత్రలో వైస్సార్ పార్టీ నేతలు మంతనాలపై ఎందుకు సమాచారం ఇవ్వలేదని సీఎం ఓ కార్యాలయంలో నుoచి ఆదేశాలు జారీచేశారు.
సచివాలయానికి చెందిన ఆర్జిలు వేలల్లో పెండింగ్, టైమ్ ఐపోయిన ప్రజలకు అందని సర్టిఫికెట్స్ పై ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయలకు ఆదేశించారు.
ప్రభుత్వ అధికారుల డబ్బులు వసూళ్లు, పనుల్లో నిర్లక్ష్యంతో పార్టీకి చెడ్డా పెరు వస్తున్నదని సజ్జాల తెలిపారని సమాచారం.
సోషల్ మీడియాలలో చురుగ్గా వుంటున్న టీడీపీ కార్యకర్తలపై దృష్టి పెట్టాలని వైస్సార్ పార్టీ నేతలు సీఎం కి తెలిపినట్లు సమాచారం.
* (టీవీ స్క్రోలింగ్)
గుంటూరు : ఆలపాటి రాజా ఇంటికి సుజనాచౌదరి – సమావేశంలో పాల్గొన్న నక్కా ఆనంద్‍బాబు, కన్నా లక్ష్మీనారాయణ – మర్యాద పుర్వకంగానే సుజనా వచ్చినట్టు ప్రచారం
* పల్నాడు జిల్లా
అమరావతి అమరేశ్వరాలయంలో నాపై అవినీతి ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమే
వచ్చే ఆదివారం ఉదయం పది గంటల నుంచి అమరావతిలోనే వుంటా
నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై ఎవరువచ్చినా బహిరంగ చర్చకు సిద్ధంగా వుంటా
గత ప్రభుత్వంలో అన్ని గ్రామాల్లో యధేచ్చగా ఇసుక అక్రమంగా తరలించారు
గత ప్రభుత్వ హయాంలో ఎన్జీటీ లో వందకోట్లు పెనాల్టీ వేసింది నిజం కాదా
ఆరోపణలు కాదు, చర్చకు రండి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సవాల్
* నెల్లూరు : ఈనెల 7వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన – ఎస్వీజీఎస్ గ్రౌండ్స్ లో సమావేశానికి హాజరవుతారు – ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు – పార్టీ శ్రేణులకు న్యాయ సలహాలు ఇవ్వడం, రాబోయే రోజుల్లో న్యాయ సహాయం చేస్తాం : టీడీపీ నేత అబ్దుల్ అజీజ్
* తెనాలిలో కౌన్సిలర్ యుగంధర్‍ను పరామర్శించిన టీడీపీ నేతలు ఆలపాటి రాజా, కన్నా లక్ష్మీనారాయణ – వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కన్నా లక్ష్మీనారాయణ – పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు – ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు : కన్నా లక్ష్మీనారాయణ
* నెల్లూరు : టీడీపీ నగర అధ్యక్షుడిగా మాజీ కార్పొరేటర్ మామిడాల మధు నియామకం – ఉత్తర్వులు జారీ చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
* strong>జగన్‍కు మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్ – తెలంగాణతో పాటు ఏపీలో ఎన్నికలకు వెళ్దాం – ఎవరి సంగతి ఏంటో తేల్చుకుందాం – రాష్ట్రాన్ని బాగు చేశాననే విశ్వాసం జగన్‍కు ఉంటే.. ఎన్నికలు పెడితే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది – సీఎం బయటకు వస్తే వేలమంది పోలీసులు ఉండాలా? – భద్రత పేరుతో చెట్లన్నీ నరికేస్తున్నారు : మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు
* విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్రానికి కేటీఆర్ లేఖ!
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న కేటీఆర్
కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానుకోవాలని కేంద్రానికి డిమాండ్
ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం తెలుగు వారందరూ కలిసి రావడం అవసరమని వ్యాఖ్య
ఎ.పి.అధ్యక్షులు తోట కు సూచన
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు.
‘‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలు ఆపాలి. కార్పొరేట్ మిత్రులకు కట్టబెట్టే పన్నాగాలు మానాలి. వర్కింగ్ క్యాపిటల్, నిధుల సమీకరణ పేరుతో.. ప్లాంట్‌ను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పాలని ప్రయత్నిస్తున్నారు’’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. కార్పొరేట్ మిత్రుల కోసం రూ.12.5 లక్షల కోట్లు మాఫీ చేశారని, అదే ఔదార్యం విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఎందుకు లేదని ప్రశ్నించారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం కేంద్రమే ఆర్థిక సాయం చేయాలని, విశాఖ ప్లాంట్ నుంచి స్టీల్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా విస్తరణ ప్రణాళికల్లో.. విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం విషయాన్ని పరిశీలించాలని కేటీఆర్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వెంటనే రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలకు వ్యతిరేకంగా చేసే పోరాటానికి కార్మికులు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని కేటీఆర్ మండిపడ్డారు. దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని వెల్లడించారు. వర్కింగ్ కాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ తాళాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పేందుకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలుచేసి, నష్టాలను సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రైవేటు కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డు పెట్టిందని తెలిపారు. దీంతో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60 శాతం వరకు పూర్తిగా ముడిసరుకుపైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలన్న చిత్తశుద్ది తమకు ఉందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. కలిసి వచ్చే శక్తులు, ప్రజాసంఘాలు, పార్టీలతో కలసి ప్రజలను మరింత చైతన్యవంతం చేస్తామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల హక్కు అని, దాన్ని కాపాడుకోవడం కోసం తెలుగు వారందరూ కలిసి రావడం అవసరమని భావిస్తున్నామన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘాలను కలిసి వారికి సంఘీభావం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ బీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌కు కేటీఆర్ సూచించారు.