Movies

పుష్ప 2 షూటింగ్ ఫినిష్ కావడానికి ఇంకా ఎన్ని రోజులంటే.. ఆ సీన్స్ కోసమే ఎక్కువ వర్క్!

పుష్ప 2 షూటింగ్ ఫినిష్ కావడానికి ఇంకా ఎన్ని రోజులంటే.. ఆ సీన్స్ కోసమే ఎక్కువ వర్క్!

టాలీవుడ్‌లో సెట్స్‌ పై ఉన్న మోస్ట్ క్రేజీయెస్ట్‌ ప్రాజెక్టుల్లో ఒకటి పుష్ప ది రూల్‌ మూవీ. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమాకు పుష్ప ది రూల్ సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ ప్రాజెక్ట్‌తో మరోసారి బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వర్షం కురిపించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పుష్ప.. ది రూల్ షూటింగ్ దశలో ఉంది.

కాగా ఈ సినిమా నుంచి ఇప్పుడొక ఇంట్రెస్టింగ్‌ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు 200 రోజులకు పైగా సమయం పడుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్‌ను పుష్ప సినిమాను మించి తెరకెక్కించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పుష్పను మించి వేరే లెవెల్ లో తెరకెక్కిస్తున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావడం కష్టమే. ఇక నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది.

ఇక ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప ది రూల్ 3 నిమిషాల యాక్షన్‌ టీజర్‌ ను లాంఛ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ టీం టీజర్‌ను రెడీ చేశారని, ప్రస్తుతం మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పై పనిచేస్తున్నారని ఇన్‌సైడ్‌ టాక్‌. యాక్షన్‌ టీజర్‌ ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో సుకుమార్‌ హింట్ ఇవ్వబోతున్నట్టు జోరుగా టాక్‌ నడుస్తోంది. మరి ఈ అప్‌డేట్ నిజమైతే ఐకాన్ స్టార్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.

పుష్ప ది రూల్ సీక్వెల్‌ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తోంది. రెండో పార్టులోనూ కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా అల్లు అర్జున్ సరసన ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుంది. పార్టు 1 కు సూపర్ హిట్‌ ఆల్బమ్‌ అందించిన రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ సీక్వెల్‌ కు కూడా అదిరిపోయే పాటలను రెడీ చేసినట్టు టాక్. దీనికి తోడు చంద్రబోస్ సాహిత్యం కూడా పుష్పను మించి ఉంటుందని సమాచారం.