ScienceAndTech

మీ ఇల్లు చల్లగుండ!.. అమల్లోకి రానున్న కూల్‌ రూఫ్‌ విధానం

మీ ఇల్లు చల్లగుండ!.. అమల్లోకి రానున్న కూల్‌ రూఫ్‌ విధానం

🔶భవనాల్లో ఉష్ణోగ్రతలు తగ్గేందుకు దోహదం

🔷ఇకపై ప్రభుత్వ, వాణిజ్య నిర్మాణాలకు తప్పనిసరి

🔶నేడు ఆవిష్కరించనున్న కేటీఆర్‌

*హైదరాబాద్‌ వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఇళ్లు, వాణిజ్య భవనాలు, కార్యాలయాల్లో పడకుండా తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందుకోసం పురపాలకశాఖ చలువ పైకప్పు (కూల్‌ రూఫ్‌) విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. తెలంగాణ కూల్‌రూఫ్‌ విధానం 2023-28ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించనున్నారు. అయిదేళ్లపాటు ఇది అమల్లో ఉంటుంది. దీనికోసం రెండు మూడేళ్లుగా కసరత్తు చేస్తున్న పురపాలకశాఖ ఎట్టకేలకు అమలుకు సిద్ధమైంది. హైదరాబాద్‌ నగరంలో 100 చ.కి.మీ. మేర, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతంలో 300 చ.కి.మీ. విస్తీర్ణంలో కూల్‌రూఫ్స్‌ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విధాన ప్రకటన సందర్భంగా అయిదేళ్ల లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించనుంది. చలువ పైకప్పులను ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించడం ద్వారా ఉష్ణోగ్రతలు తగ్గించడం, నగరాల వారీగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా ఏజెన్సీలతో సమన్వయం, వీటి కోసం పనిచేసే సిబ్బంద