హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లో రూ.11వేల 355 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుడతారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు ప్రాజెక్టులను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.