తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్ ఢిల్లీ వేదికగా నరేంద్ర మోడీని ఢీ కొట్టాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఇరవై ఒక్క పార్టీలతో ఒక భారీ సమావేశాన్నే ఏర్పాటు చేశారు. చిత్రమేంటి అంటే ఈ మీటింగ్ కి కేసీయార్ కి ఆహ్వానం పంపారు కానీ ఏపీ నుంచి జగన్ కి చంద్రబాబుల కు ఇన్విటేషన్ లేదని ప్రచారం సాగుతోంది. అంటే స్టాలిన్ ఏపీలో రెండు ప్రధాన పార్టీలూ యాంటీ బీజేపీ కూటమికి దూరం అని భావిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది.
అయితే రాజకీయాల మీద ఆ మాత్రం అవగాహన ఉన్న వారికి అర్ధమయ్యే విషయం ఏంటి అంటే కేంద్రంలో ని బీజేపీ కి వైసీపీ టీడీపీ మిత్రులుగానే ఉన్నాయని. ఈ రెండు పార్టీలు గత నాలుగేళ్ల కాలంలో మోడీని కానీ ఆయన పాలనను కానీ పల్లెత్తు మాట అనకుండా నెట్టుకుని వస్తున్నాయి. అదే టైం లో మోడీ సర్కార్ ప్రవేశపెట్టే ప్రతీ బిల్లుకూ వైసీపీ టీడీపీ మద్దతుగా నిలుస్తున్నాయి.
దేశంలో ఏమి జరిగినా మోడీ మీద విపకాలు విరుచుకుపడినా ఈ రెండు పార్టీలు మాత్రం మౌన ముద్రతోనే ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పుకోవాలీ అంటే బీజేపీతో పరోక్ష దోస్తీని ఈ పార్టీలు చేస్తున్నాయని అంతా నమ్ముతున్నారు. పైగా జాతీయ రాజకీయాలు తమకు పట్టవని తేల్చి చెప్పేస్తున్నాయి. ఏపీలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునే పనిలో వైసీపీ ఉంటే చంద్రబాబు ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారు.
2018లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ ఆ తరువాత ఓటమిని ఏపీలో చవి చూసింది. ఈసారి ఆ తప్పు చేయకూడదు అనుకుంటోందని టాక్. వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ కూడా బీజేపీ అండ కేంద్రంలో దన్ను ఉంటేనే ఏపీలో మళ్లీ విజయం అని నమ్ముతోంది. ఇలా ఈ రెండు పార్టీల తీరు ఉండబట్టే స్టాలిన్ నుంచి ఆహ్వానం రాలేదని అంటున్నారు.
విశేషం ఏంటి అంటే జగన్ సీఎం గా ప్రమాణం చేసినపుడు ముఖ్య అతిధిగా స్టాలిన్ వచ్చారు. అలాగే స్టాలిన్ తో చంద్రబాబుకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయినా సరే ఏపీ వైపు స్టాలిన్ కన్నెత్తి చూడలేదు అంటే ఇక్కడ పాలిటిక్స్ ని ఆయన బాగా అర్ధం చేసుకుననరని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే బీయారెస్ కి ఆహ్వానం అందింది. కానీ ఆ పార్టీతో దోస్తీ చేస్తున్న కర్నాటక జేడీఎస్ కి ఇన్విటేషన్ లేదు. కేసీయార్ అయితే ఈ సమావేశానికి వెళ్ళడంలేదు తన పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీ కె కేశవరావుని పంపిస్తున్నారు.
ఇక దేశంలో కీలకంగా ఉన్న ఇరవ ఒక్క పార్టీలను స్టాలిన్ ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకీకృతం చేయాలన్నది స్టాలిన్ ఆలోచనగా ఉంది. దానికి సన్నాహకంగా ఈ మీటింగ్ అని అంటున్నారు. ఈ మెటింగ్ కి హాజరయ్యే వారి సంఖ్య. అక్కడ భేటీలో వచ్చే అంశాలు తీర్మానాలు బట్టి రానున్న రోజులలో తన వ్యూహాన్ని మరింత పదును పెట్టడానికి స్టాలిన్ చూస్తున్నారు అని అంటున్నారు.
ఇక దేశంలో మమతా బెనర్జీ, కేసీయార్, కేజ్రీవాల్ వంటి వారు కూడా దేశ రాజకీయాల్లో సత్తా చూపించాలని ఎంతో ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వారు చేసిన ప్రయత్నాలు ఒక స్థాయి వరకే వచ్చి ఆగిపోతునాయి. ఇపుడు డిఎంకె నేత స్టాలిన్ ప్రయత్నాలు ఎంతదాకా సఫలం అవుతాయన్నది చర్చగా ఉంది. వచ్చ ఎన్నికల్లో దేశంలో మోడీ బీజేపీ ఓడితే విపక్ష కూటమి అధికారంలోకి వస్తుందని స్టాలిన్ లాంటి వారు బలంగా నమ్ముతున్నారు.
ఒక వేళ అదే జరిగితే ఏపీలోని పార్టీలకు జాతీయ రాజకీయాలో సరైన స్థానం ఉంటుందా ? అన్న చర్చ ఇపుడు వస్తోంది. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న చంద్రబాబు ఆ వైపు తొంగి చూడడంలేదు. జగన్ సైతం ఏపీకే పరిమితం అయ్యారు. ఇతర విపక్షాలు కూడా ఏపీని పక్కన పెట్టడం మాత్రం చిత్రంగానే ఉంది అంటున్నారు.అయితే స్టాలిన్ ఇన్విటేషన్ దక్కని పార్టీలలో శివసేన జేడీఎస్ శిరోమణి అకాలీదళ్ వంటి పార్టీలు వీటిలో ఉన్నాయి.
ఇక కేవలం రాజకీయ పార్టీలతో పాటు మేధావులను ప్రజాస్వామ్య ప్రియులను కూడా స్టాలిన్ ఆహ్వానించారు.
వీరిలో ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాతీయ బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీరేంద్రసింగ్ యాదవ్ దిల్లీ వర్శిటీ ప్రొఫెసర్లు లక్ష్మణ్యాదవ్ సూరజ్ మండల్ రతన్లాల్లూ వంటి వారు ఉన్నారు.