చింతపల్లి, న్యూస్టుడే: అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లి మండలం చౌడుపల్లి-2 సచివాలయం పరిధిలో ఒక వాలంటీరు పింఛ నను అరకొరగా పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాంగెడ్డ కొత్తూరు గ్రామానికి చెందిన వాలంటీరు కించె బాలకృష్ణ తన పరిధిలో 26 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన రూ.66,250 ను సచివాలయ సంక్షేమ సహాయకుడు తిరుపతిరావు బ్యాంకు నుంచి డ్రా చేసి వాలంటీరుకు అందజేశారు. పింఛను సొమ్మును 13 మందికి ఇచ్చి మిగిలిన వారికి పంపిణీ చేయలేదు. మిగిలిన సొమ్ము రూ.30,250 పరారయ్యాడు. నాలుగో తేదీ నుంచి ఆ వాలంటీరు కనిపించకపోవడంతో సచి వాలయ సంక్షేమ సహాయకుడు ఎంపీడీఓ సీత య్యకు సమాచారం అందించారు. దీనిపై ఎంపీడీ ఓను వివరణ కోరగా ప్రభుత్వం ఈనెల 8వ తేదీ వరకు పింఛన్ల పంపిణీకి గడువు ఇచ్చిందన్నారు. వాలంటీరు కుటుంబ సభ్యులు పింఛను సొమ్మును శుక్రవారం నాటికల్లా తిరిగి చెల్లిస్తా మని హామీ ఇచ్చారని చెప్పారు.