🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿విష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నాడు భృగుమహర్షి. ప్రతీకారం తీర్చుకోవడానికి బదులు మహర్షికి సేవ చేయడంతో తన భర్తపై కోపగించుకుని వైకుంఠం వదలి భూలోకం చేరింది శ్రీమహాలక్ష్మి.
🌸కరవీర క్షేత్రంలో కొలువు తీరింది. నీటిలో మునిగిన ఈ క్షేత్రాన్ని శ్రీమహాలక్ష్మి తన కరంతో అంటే చేతితో పైకెత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీరపురం అనే పేరు ఏర్పడింది.
🌿అంతేకాకుండా కొల్హుడు అనే రాక్షసుణ్ణి అమ్మవారు అంతమొందించిన క్షేత్రం కూడా ఇదే. మహారాష్ట్ర నిర్మాణ శైలిలో కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మీ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
🌸 గర్భాలయంలో అమ్మవారు సుమారు మూడు అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. పద్మవాసినిగా నాలుగు చేతుల్లో చెరకు విల్లు, డాలు, కలశం, మారేడుకాయ ధరించి దర్శనమిస్తుంది.
🌿 కిరీటం, శిరస్సుపై శేషపడగను ధరించి ఉండే కొల్హాపూర్ మహాలక్ష్మి అష్టాదశ శక్తిపీఠాలలో ఏడోది.
🌸ఉత్తరాయణంలో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లోనూ – దక్షిణాయణంలో నవంబర్ 9, 10, 11 తేదీల్లోనూ అమ్మవారిపై సూర్యకిరణాలు పడుతుండడం నిర్మాణపరమైన విశేషం.
🌿 ప్రతి సంవత్సరం చైత్రపూర్ణిమనాడు సాయంత్రం 7.30 -9గంటల మధ్య అమ్మవారికి రథోత్సవం జరుగుతుంది…🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿