NRI-NRT

రియాధ్ వద్ద హైద్రాబాదీలతో సహా 5 గురు భారతీయుల మృతి

రియాధ్ వద్ద హైద్రాబాదీలతో సహా 5 గురు భారతీయుల మృతి

పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రా (మక్కా ప్రదక్షిణం) చేయడానికి వెళ్తూ మార్గమధ్య రోడ్డు ప్రమాదంలో ఒక హైద్రాబాద్ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది, చిన్నారి పాపతో సహా గర్భవతి అయిన భార్యతో సహా మోత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాదరకమైన సంఘటన గురువారం సౌదీ అరేబియాలోని రియాధ్ నగరం సమీపంలో చోటు చేసుకోంది.

రియాధ్ నగరంలోని సువైదీ ప్రాంతంలో నివసిస్తున్న హైద్రాబాద్ నగరానికి చెందిన 24 ఏళ్ళ అహ్మద్ అబ్దుల్ రషీద్ మరియు అతని భార్య గర్భవతి అయిన ఖన్సా మరియు మూడెళ్ళు కూతురు మర్యంలు తమ పొరుగున ఉన్న రాజస్ధాన్ కు చెందిన మోహమ్మద్ షాహీద్ ఖత్రీ అనే కుటుంబంతో కలిసి గురువారం రాత్రి మక్కాకు ఉమ్రా చేయడానికి వెళ్తుండగా ముజమియా అనే ప్రాంతం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పొరపాటున ఎదురుగా వచ్చిన ఒక కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకోనడంతో అక్కడికక్కడె నలుగురు ప్రాణాలు కోల్పోగా మరోకరు ఆసుపత్రిలో మరణించారు.

మరణించిన వారిలో రషీద్ భార్య ఖన్సా, కూతురు మర్యం మరియు షాహీద్ ఖత్రీ, అతని భార్య మరియు నాలుగెళ్ళ కుమారుడు ఉన్నారు. ఖత్రీ భార్య సుమయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కాగ అహ్మద్ అబ్దుల్ రషీద్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు.

మృతులందరు తమ దారిలో సమక్రంగా ఓపికతో ప్రయాణిస్తుండగా, పొరపొటుగా ఎదురుగా వస్తున్న మరో కారు వేగంగా ఢీకొనడంతో వీరి కారు వెనకు వస్తున్న ఇతర కార్లు కూడ ఢీకొనడంతో వీరి కారు నుజ్జనుజ్జయినట్లుగా సమాచారం.

మృతులందరికి శుక్రవారం రియాధ్ నగరంలో అంతిమక్రియలు నిర్వహించినట్లుగా వారికి అధికారిక లాంఛనాలను పూర్తి చేయడంలో సహకరించిన తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు అబ్దుల్ జబ్బార్ తెలిపారు.

మృతుడు అహ్మద్ అబ్దుల్ రషీద్ తల్లిదండ్రులు హైద్రాబాద్ నగరానికి చెందిన వారు, సుదీర్ఘ కాలం సౌదీలో ఉండి కొద్ది కాలం క్రితమె హైద్రాబాద్ కు తిరిగి వెళ్ళిపోయారు. అహ్మద్ రియాధ్ నగరంలోనె జన్మించి ఇక్కడె పెరిగారు.