ScienceAndTech

ఏపీ ఫైబర్ నెట్ వినియోగదారులకు శుభవార్త!!

ఏపీ ఫైబర్ నెట్  వినియోగదారులకు శుభవార్త!!

దేశంలో ఎక్కడా లేనివిధంగా సినిమా విడుదల రోజున ఏపీ ఫైబర్ నెట్ లో కొత్త సినిమాలు చూసే అవకాశం కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలకు గొప్ప సువర్ణ అవకాశం. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని ఏప్రిల్ 7 న లాంఛనంగా ప్రారంభించబోతుంది ప్రసాద్ లాబ్స్ వేదికగా!!
ఇప్పటికె APSFL లో OTT ప్లాట్‌ఫామ్‌ సర్వీసస్ సబ్ స్క్రైబ్ చేసుకొని “ఫస్ట్ డే ఫస్ట్ షో” APSFL ప్లాట్ ఫామ్ లో చూడవచ్చు..
ఏపి ఫైబర్ నెట్ డిజిటల్ సాధికారత ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మార్చడం, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను వివక్షత లేని ప్రాతిపదికన అందుబాటులో ఉండే “ట్రిపుల్ ప్లే” సేవలను (IPTV, ఇంటర్నెట్, టెలిఫోన్) అందించడం. గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని పౌరులకు మరియు ప్రభుత్వ సంస్థలకు ఇది మానవాభివృద్ధిని సులభతరం చేస్తుంది. ఆర్థికాభివృద్ధిని పెంచుతుంది మరియు గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. APSFL తన నిరంతర ప్రయత్నాల ద్వారా గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో సురక్షితమైన, నమ్మదగిన, మరియు అధిక నాణ్యత గల కనెక్టివిటీని అందిస్తుంది.
APSFLలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరించి అత్యధిక స్పీడ్ తో ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది!!

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫైబర్ నెట్ ఛైర్మెన్ పునూరు గౌతంరెడ్డి, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అలీ, సినీ నిర్మాత సి కళ్యాణ్ గారు, ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు హాజరు కానున్నారు!!