🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 08.04.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (08-04-2023)
ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. బంధు వర్గం నుంచి ఒక మంచి పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు సన్నిహితులకు సహాయం చేయడం జరుగుతుంది. కుటుంబంలో దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ పరంగా ఆశించిన ప్రయోజనం అనుభవానికి వస్తుంది. వృత్తి వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (08-04-2023)
ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ కు అవకాశం ఉంది. ఇతర సంస్థలకు మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. బంధువులు అపార్థం చేసుకునే సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఐటి నిపుణులకు పురోగతి కనిపిస్తోంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (08-04-2023)
ఈ రాశి వారు ఈ ఉద్యోగ పరంగా మంచి స్థితికి చేరుకునే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా సానుకూలమైన మార్పు కనిపిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. కుటుంబంలో ఒకటి రెండు సమస్యలు అప్రయత్నంగా చక్కబడతాయి. వ్యాపారం నిలకడగా ముందుకు సాగుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రేమ వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (08-04-2023)
ఈ రాశి వారికి ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. బంధువుల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్నేహితుల సహకారంతో ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాల శాతం పెరుగుతుంది. వివిధ వృత్తుల వారికి కొత్త అవకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (08-04-2023)
వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు అవరోధాలు ఎదురైనా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఇతర వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోయే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చు. రుణ దాతల దగ్గర నుంచి ఒత్తిడి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (08-04-2023)
ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం కనిపిస్తోంది. వృత్తి వ్యాపారాలు సజావుగా ముందుకు సాగిపోతాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులు విజయాలు సాధిస్తారు.ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అదృష్ట యోగం పడుతుంది. ఇక రాదని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పరిచయస్తులలో మంచి పెళ్లి సంబంధం కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (08-04-2023)
ఆర్థిక ప్రయత్నాలలో మీ ప్రయత్నాలు, మీ ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.దూర ప్రాంతం నుంచి శుభవార్త ఒకటి అందుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (08-04-2023)
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో చక్కబడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా సాగుతాయి. డాక్టర్లు, లాయర్లకు క్షణం కూడా తీరిక ఉండదు. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. పెళ్లి సంబంధం వాయిదా పడే అవకాశం ఉంది. . పిల్లలు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (08-04-2023)
ఆర్థిక విషయాలలో కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువులు కొందరు మీ సలహాలను తీసుకుని ప్రయోజనం పొందుతారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. ఆహార విహారాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లి మాటలకు దారితీస్తాయి.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (08-04-2023)
ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (08-04-2023)
అదనపు ఆదాయ ప్రయత్నాలు చాలావరకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారు తుంది. అనవసర ఖర్చులను తగ్గించుకొని పొదుపు పాటించడం అవసరం. ఇతరు లకు వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం ప్రస్తుతానికి విరమించడం మంచిది. వృత్తి వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగంలో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం సొంత ఊరులోనే లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (08-04-2023)
మనసులోని ఒకటి రెండు కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. వ్యాపారులు భారీగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెళ్లి సంబంధం విషయంలో చికాకులు ఎదురవుతాయి. బంధువులు కొందరు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రేమ జీవితంలో ముందడుగు వేస్తారు.
🦈🦈🦈🦈🦈🦈🦈