దిగ్గజ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. దాదాపు రెండేళ్లుగా అర్జున్ ముంబై ఇండియన్స్ టీమ్‌తో పాటే ఉంటున్నాడు
దిగ్గజ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తనయుడు అర్జున్ ఐపీఎల్ (IPL 2023) అరంగేట్రం కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. దాదాపు రెండేళ్లుగా అర్జున్ (Arjun Tendulkar) ముంబై ఇండియన్స్ (MI) టీమ్‌తో పాటే ఉంటున్నాడు. అయితే ఇప్పటికీ అతడికి తుది జట్టులో స్థానం మాత్రం దొరకలేదు. ఈ రోజు (శనివారం) రాత్రి స్వంత మైదానంలో జరగబోయే మ్యాచ్‌లో ముంబై జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌తో (MIvsCSK) తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో అర్జున్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సచిన్ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అర్జున్‌కు విషెస్ చెబుతూ తాజాగా చేసిన ఓ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. సారా పోస్ట్ చేసిన ఫొటోలో అర్జున్ ఆమె భుజంపై తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. “లిటిల్ బ్రదర్“ అంటూ ఆ ఫొటోకు సారా క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో అర్జున్‌కు అవకాశం వస్తుందని చాలా మంది నెటిజన్లు అనుకుంటున్నారు. కాగా, గాయం కారణంగానే తొలి మ్యాచ్‌లో అర్జున్ ఆడలేదని ముంబై టీమ్ కోచ్ మార్క్ బౌచర్ తెలిపాడు. మరి, అర్జున్ గాయం నుంచి కోలుకున్నాడో లేదో మాత్రం ఇంకా స్పష్టత లేదు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడిన ముంబై టీమ్ ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ రోజు స్వంత మైదానంలో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన చెన్నై టీమ్ ఒక విజయం సాధించింది.