పుష్ప అంటే ఫైరే..
ఇప్పుడంతా ఆ ఫీవరే..!
_________
రాఘవేంద్రుడి గంగోత్రిలో
జలకమాడి..
ఆర్యుడై వర్ధిల్లి..
నాటి నుంచి ఆగని
పరుగు పెడుతూ..
తనకు తాను
మెరుగు పెట్టుకుంటూ..
అ అంటే అమలాపురం
మాస్ గంతుల నుంచి
అ అనగా అల్లు వైకుంఠపురం
వరకు సాగిన
ఈ సన్నాఫ్ అరవింద
ప్రయాణం…
భావి హీరోలకు ఒక వేదం..!
చిరును చూస్తూ పెరిగాడేమో
చిరుత వేగం..
రామలింగయ్య కామెడీ టచ్
అబ్బో..ఈ వరుడు దేశముదురు..
కిరాయికి వచ్చే
జులాయి_ కాదండోయ్..
కెరీర్లో యమస్పీడుగా
లగెత్తిన రేసుగుర్రం!
పుష్ప అంటే ప్లవర్ అనుకోపోయినా
ఇంత పవర్ ఉందనీ
ఊహించలేదు..
ఈ బంటు బన్నీలో..
వాల్మీకికే వెండితెరపై
వెరైటీగా రామాయణం
చూపించిన సరైనోడు..
దేవుడా..ఆంటూ
సర్వం జగన్నాథం
చేసేసిన
దువ్వాడ జగన్నాథం…
పుష్పరాజ్ గా
అందుకున్నాడు
సరికొత్త రిధం..
దునియా మొత్తం మీద
ఎక్కడ విన్నా ఇతగాడి
గురించిన టాకులే..
కాలీడ్చుకుంటూ
టిక్ టాకులే…!
ఇప్పుడు రెండో అవతారం..
పుష్ప టూ..
ట్రైలర్లోనే పవర్..
సరికొత్త ఫీవర్..
టీజర్..బహు డేంజర్..
అదిరిపోయిన కర్టెన్ రైజర్..
నో డౌట్..
బన్నీ కెరీర్లో
ఇది మరో బల్డోజర్..!
పుష్పరాజ్ ..వచ్చేయ్ తొరగా
ఫ్యాన్స్..వెయిటింగిక్కడ..
ఇంతకీ నువ్వెక్కడ..!?
అదే ఇప్పుడు ప్రశ్న..
సుకుమారే జవాబు..
మొత్తానికి ఈ బన్నీ
కలెక్షన్ల నవాబు..!
Happy birthday Arjun