అనుకున్నట్లే జరిగింది..
– కేసీఆర్ సర్కార్‌పై ఓ రేంజ్లో..
కేసీఆర్ సర్కార్‌పై మాట్లాడుతారని ముందే ఊహించిన బీజేపీ శ్రేణులు
తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు : మోదీ
అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది : మోదీ
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం మా లక్ష్యం..
కానీ కొందరు అభివృద్ధిని కావాలని అడ్డుకుంటున్నారు
రాష్ట్రంలో కుటుంబం పాలన, అవినీతిని పెంచి పోషిస్తున్నారు
నిజాయితీగా పని చేసే వారంటే వారికి నచ్చడం లేదు
తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతి పెరిగింది
కొందరి గుప్పెట్లోనే అధికారం మగ్గుతోంది
రాష్ట్రంలో కొంత మంది ప్రగతి నిరోధకులుగా మారారు
ప్రజల సొమ్ము అవినీతి పరులకు చేరకుండా చర్యలు చేపట్టాం
నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లోనే నిధులు వేస్తున్నాం : మోదీ
కుటుంబ వాదంతో ప్రతీ వ్యవస్థను తమ అదుపులో పెట్టుకోవాలనుకున్నారు
వారి నియంత్రణను ఎవరు సవాల్ చేయకూడదని అనుకుంటారు
డిజిటల్ పేమెంట్స్ ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా చేశాం
రాష్ట్రాభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం రాలేదు
దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా?
అవినీతిపరులపై పోరాటం చేయాలా?.. వద్దా?
అవినీతిపరులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలా.. వద్దా?
నాపై పోరాటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయి : ప్రధాని మోదీ
కోర్టుకు వెళ్లారు.. అక్కడా వారికి షాక్ తగిలింది..
వారసత్వ రాజకీయాల్లో భాగంగా పేదల రేషన్ కూలా లాక్కున్నారు
80 కోట్ల మందికి నేడు ఉచితంగా రేషన్ అందిస్తున్నాం