హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 (26-03-2023 నుండి 01-04-2023) ✍🏻
🗓 ఈ వారం మీ రాశి ఫలితాలు
🐐 మేషం (09-04-2023 నుండి 15-04-2023)
శుభ ఫలితాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో సత్వర విజయం సిద్ధిస్తుంది. అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. చేపట్టే పనులను సకాలంతో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతారు. కొత్త వస్తువులను సేకరిస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొందరి ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. మీ మంచితనమే మీ ఎదుగుదలకు మూలం అవుతుంది. గిట్టనివారు చేసే ఆరోపణలను పట్టించుకోరాదు. ఆర్ధికంగా శుభకాలంగా గోచరిస్తోంది. అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సూర్య ఆరాధన శుభప్రదం.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం (09-04-2023 నుండి 15-04-2023)
మంచికాలం. ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. అనుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులను సద్భావంతో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఉంటుంది. దృఢ సంకల్పాలు శీఘ్ర విజయాన్ని ఇస్తాయి మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. అధికారుల సహకారం అందుతుంది. విష్ణు ఆరాధన శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం (09-04-2023 నుండి 15-04-2023)
లక్ష్యం నెరవేరుతుంది. తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు. మీలోని విశ్వాసం మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు వచ్చాయి. ఒక శుభవార్త వింటారు. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. అధికారులతో, పెద్దలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. అందరినీ సమభావంతో చూడడం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. ఇష్టదైవారాధన మంచి ఫలితాలను ఇస్తుంది.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం(09-04-2023 నుండి 15-04-2023)
సమాజంలో మంచిపేరు దక్కుతుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. అనవసర విషయాలను పెద్దవి చేసి చూడటం సరికాదు. ప్రగతి సాధిస్తారు. ముఖ్యమైన లావాదేవీల్లో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. చెడు తలంపులు వద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు | అవసరం. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. వారం మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విష్ణు సందర్శనం శుభప్రదం
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం(09-04-2023 నుండి 15-04-2023)
ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అన్న విషయాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. అనుభవజ్ఞుల సలహాలతో లాభాలను అందుకుంటారు. తోటివారి సహకారం అందుతుంది. కాలం మిశ్రమంగా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఆదిత్య హృదయం చదవాలి
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య(09-04-2023 నుండి 15-04-2023)
శుభయోగాలు పుష్కలంగా ఉన్నాయి. మీ రంగాల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. కాలం సంపూర్ణంగా సహకరిస్తోంది. అభివృద్ధి కోసం చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. తోటివారి సహకారం అందుతుంది. ఆటంకాలు తొలుగుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. ఈశ్వర ఆరాధన శుభప్రదం.
💃💃💃💃💃💃💃
⚖ తుల(09-04-2023 నుండి 15-04-2023)
ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. మీలో శ్రద్ధను పెంచాలి. మనోధైర్యంతో అభివృద్ధి సాధిస్తారు. పరీక్షాకాలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైన కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక | శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తిచేయగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. ఆర్థికంగా మిశ్రమకాలం. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అకారణ కలహసూచన ఉంది. శాంతంగా వ్యవహరించండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గురుధ్యానం శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం (09-04-2023 నుండి 15-04-2023)
ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి చాలా అవసరం. బంధు, మిత్రులతో కొన్ని సందర్భాల్లో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. కలహాలకు దూరంగా ఉండాలి. రుణభారం పెరగకుండా చూసుకోవాలి. ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి. దుర్గారాధన శుభప్రదం.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు(09-04-2023 నుండి 15-04-2023)
ఆశించిన ఫలితాలు దక్కుతాయి. మనోధైర్యమే విజయానికి మూలం అని గ్రహిస్తారు. మీ రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును వదలకండి. అపోహలు తొలగుతాయి. కొన్ని కీలక విషయాల్లో లౌక్యంగా వ్యవహరించడం మంచిది. పట్టుదలతో ముందుకు సాగండి. వారాంతంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విష్ణు సహస్రనామం చదవడం శుభప్రదం.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం(09-04-2023 నుండి 15-04-2023)
మంచి కాలం ఉంది. కష్టాలను తట్టుకొని లక్ష్యాలను చేరుకుంటారు. ఆశయాలు నెరవేరుతాయి. సమయానికి బుద్ధిబలం పనిచేస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. శ్రమ పెరుగుతుంది. మనఃశ్శాంతి కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం శుభప్రదం. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. అదృష్టం ఉంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. లక్ష్మీస్తుతి శుభకరం.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం(09-04-2023 నుండి 15-04-2023)
శుభప్రద యోగాలు ఉన్నాయి. మీ మీ రంగాల్లో గుర్తింపు లభిస్తుంది. ఉన్నతస్థితికి ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసర విషయాల గురించి అతిగా ఆలోచించకండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. విమర్శకుల మాటలను పట్టించుకోకండి. ఒత్తిడిని దరిచేరనీయకండి. కనకధారాస్తోత్రం చదవడం వల్ల ఉత్తమ ఫలితాన్ని లభిస్తాయి.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం(09-04-2023 నుండి 15-04-2023)
చేపట్టే పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. సామరస్యధోరణితో వ్యవహరిస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. మానసికంగా దృఢంగా ఉండి ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొంటారు. మీ రంగాల్లో జాగ్రత్తలు అవసరం. బంధు, మిత్రుల సహకారం అందుతుంది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. కొన్ని సమస్యలు బాధిస్తాయి. అస్థిర నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. మనోవిచారం కలుగుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు కలుగకుండా జాగ్రత్తపడాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ ఆరాధన శక్తిని ఇస్తుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈