తిరుమల నంబి గారు శ్రమ అనుకోకుండా నిత్యం స్వామి వారి కైంకర్యమే మహాదానందం తో పాపనాశనానికి వెళ్లి అక్కడ నుండి నీటికుండ నెత్తికి ఎత్తుకొని స్వామి సన్నిధికి చేర్చేవాడు.
🌸 పరమభాగవతోత్తముడైన తిరుమలనంబి శ్రమకు అలసట.! స్వామి తిరుమలనంబి శ్రమను తీర్చదలిచి స్వామీ వేటబాలుడై
ధనుర్బాణాలు ధరించి తిరుమల నంబి తీర్థం తెచ్చే దారిలో చెట్టునీడన. కూర్చున్నాడు.
🌿 స్వామివారికి నంబి తీర్థం తెస్తున్నది చూచాడు స్వామి నంబిని దాహంగా ఉంది గుక్కెడు నీళ్లు పోయండి స్వామి అన్నాడు. అందులకు నంబి” బాలకా ! ఇది దివ్యజలం,
🌸స్వామి అభిషేకపు జలమిది నీవు అడగరాదు నేనివ్వరాదు అన్నాడు. అయిననూ వేటగాడు గా వున్న స్వామీ తాతా ! నీరు పోసి ప్రాణం రక్షించవా ? అన్నాడు.
🌿నీ దాహం తీర్చాల్సినవాడు భగవంతుడు బాలకా కావున భగవంతుని ప్రార్థించు అతడే రక్షకుడు, ప్రాణరక్షకుడు చెప్పి స్వామి అభిషేకం నకు నాకు సమయాతీతం అవుతున్నదని వేగంగా అడుగుసాగించాడు నంబి.
🌸స్వామి నంభి తీసుకెళుతున్న కుండకు బాణం కొట్టాడు దానికి చిల్లు పడింది నీటి ధార సాగింది స్వామి దోసిటితో నీరు త్రాగసాగాడు కుండ తేలిక అయింది
🌿 ఎందులకు అని తిరుమల నంబి తిరిగి చూచాడు బాలుడు చేత బాణం చే కుండకు ఏర్పడిన రంధ్రం నుండి ధారగా పడుచున్న స్వామి వారికి అభిషేకం చివరి నీటిబొట్టుతో పూర్తిగా ఖాళి అయినది అంతటితో నంబి హతాశుడైనాడు కూలబడ్డాడు.
🌸 శ్రీ స్వామికి ఏదో అపచారం చేసాను అని గొల్లుమన్నాడు, కన్నీరు కాలువ కట్టింది, అది చూచి స్వామి నివ్వెరపోయాడు ఎంతటి భక్తి భగవంతుని కన్నీరు భగవంతుని బాష్బమైంది.
🌿”తాతా లే నీకు పవిత్రజలం చూపుతాను నాతొ రా అని నంబి చేయిపట్టుకొని లేపి రెండేరెండు అడుగుల్లో కొండచరియకు చేరాడు. అక్కడ నుండి స్వామి బాణం ఎక్కుపెట్టి, కొండకు కొట్టాడు మిరమిట్లు మెరుపుతో కొండనుంచి జలధార. అదే ఆకాశగంగ.
🌸 తిరుమలనంబికి తెలివి వచ్చింది, జలధార బంగారుబిందె మరొకరు, వినలేదు, కనలేదు అంతటితో నంబి కాలాతితం కాకూడదు అని ఆ ఆకాశగంగ తీర్థంతో ఆలయానికి చేరుకున్నాడు అంతా చకితులయ్యారు దానిని నంబి గమనించలేదు.
🌿 నాటి నుంచి ఇప్పటికీ ఆకాశగంగ తీర్థంతోనే శ్రీవేంకటేశ్వరస్వామికి అభిషేకం జరుగుతుంది…