NRI-NRT

విజయవాడ…ప్రయాణికులున్నా.. విమానాలే లేవు

విజయవాడ…ప్రయాణికులున్నా.. విమానాలే లేవు

తాజాగా తిరుపతి నుంచి విజయవాడకు వచ్చి శిర్డీకి వెళ్లే విమాన సర్వీసుకు సైతం డిమాండ్ పెరుగుతోంది. మిగతా విమానాశ్రయాల్లో ఒక కొత్త రూట్లో సర్వీసు ఏర్పాటు చేస్తే అలవాటు పడడానికే చాలా సమయం పడుతుంది.

తాజాగా తిరుపతి నుంచి విజయవాడకు వచ్చి శిర్డీకి వెళ్లే విమాన సర్వీసుకు సైతం డిమాండ్ పెరుగుతోంది. మిగతా విమానాశ్రయాల్లో ఒక కొత్త రూట్లో సర్వీసు ఏర్పాటు చేస్తే అలవాటు పడడానికే చాలా సమయం పడుతుంది. కానీ విజయవాడకు ఆ సమస్య లేదు. ఏ నగరానికి సర్వీసు ఏర్పాటు చేసినా కొద్దిరోజుల్లోనే భారీ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం తిరుపతి నుంచి విజయవాడకు వచ్చి ఇక్కడి నుంచి శిర్డీకి మధ్యాహ్నం 12.25కు బయలుదేరి వెళ్తాంది. ఇదే సమయంలో శిర్డీ నుంచి మరో సర్వీసు విజయవాడకు సాయంత్రం 4.35కు వచ్చి తిరుపతి వెళుతోంది. ఈ రెండు సర్వీసులకు ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

‘గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం రోజుకు 18 దేశీయ సర్వీసులు వచ్చి వెళ్తున్నాయి. 2019కి ముందే గన్నవరానికి ఇతర నగరాల నుంచి రోజుకు 25కు పైగా సర్వీసులు వచ్చేవి. ఇటు నుంచి తిరిగి వెళ్లే సర్వీసులతో కలిపితే 55కు పైగా ఉండేవి. ఏటా 12 లక్షల మంది | ప్రయాణికులు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించేవారు. ప్రతి నెలా కనీసం లక్ష మంది ప్రయాణించేవారు. 2023 నాటికి ఏటా కనీసం 15 లక్షల మందికి పైగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. ప్రస్తుతం | పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కొవిడ్ తర్వాత చాలా విమానాలు పునరుద్ధరించలేదు. ప్రస్తుతం నడుస్తున్న సర్వీసుల్లో రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్యను బట్టి ఈ ఏడాది తొమ్మిది నుంచి పది లక్షల లోపు ప్రయాణికులు ఉంటారు. విమానాల సంఖ్యను పెంచితే ప్రయాణికులు గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంది. ‘

గన్నవరం వరుసగా నాలుగేళ్లు దేశంలోనే అత్యంత ఎక్కువ ప్రయాణిక వృద్ధి కలిగిన విమానాశ్రయంగా 2019 వరకూ రికార్డు నెలకొల్పింది. 2015లో ఏడాదికి నాలుగు లక్షల మంది మాత్రమే ప్రయాణించారు. విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఏటేటా ప్రయాణికులు లక్షల్లో పెరిగారు. 2016లో ఆరు లక్షలు, 2017లో తొమ్మిది, 2018లో 12లక్షలకు చేరారు. కేవలం మూడేళ్లలోనే | ప్రయాణికుల సంఖ్య మూడు రెట్లు అధికమైంది. ఇక్కడి నుంచి ఏ నగరానికి విమాన సర్వీసులను ఏర్పాటు చేసినా ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం పైనే ఉండేది. దీనికి ప్రధాన కారణం విజయవాడకు చుట్టుపక్కల ఉమ్మడి గుంటూరు, గోదావరి జిల్లాలు, ప్రకాశం వరకూ ప్రయాణికులు ఇక్కడికే వచ్చి విమానాలు ఎక్కడమే. అంతకుముందు వరకూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు వెళ్లి విమానాలు ఎక్కేవాళ్లు. గన్నవరంలోనే ముంబయి, దిల్లీ, చెన్నై, బెంగళూరు, కొచ్చి, వారణాశి, హైదరాబాద్ సహా దేశంలోని పది నగరాలకు ఎక్కువ సర్వీసులు నడపడంతో ప్రయాణికులు ఇక్కడి నుంచే అలవాటు పడ్డారు.
కొత్త రూట్లు చాలా ఉన్నాయ్…