Politics

పంజాబ్ లో ఉదయం 7.30కే ప్రభుత్వ కార్యాలయాలు: సీఎం

పంజాబ్ లో ఉదయం 7.30కే ప్రభుత్వ కార్యాలయాలు: సీఎం

చండీగఢ్: పంజాబ్లో ప్రభుత్వ కార్యాల యాలు ఇకపై ఉదయం 7.30 గంటలకే తెరుచు కోనున్నాయి. మే 2 నుంచి ప్రారంభమయ్యే ఈ కొత్తవేళల ప్రకారం మధ్యాహ్నం 2.00 గంటలకు కార్యాలయాలన్నీ మూతపడతాయి. జులై 15 దాకా ఇవే పనివేళలు కొనసాగుతాయి. ఈ మేరకు రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ శనివారం ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఉదయం 9.00 నుంచి సాయంత్రం 5.00 గంటల దాకా రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వేసవి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సీఎం తెలి పారు. తద్వారా విద్యుత్తు డిమాండుపై ఇప్పుడు ఉన్న భారం కూడా తగ్గుతుందన్నారు..