షుగర్, బీపీ, థైరాయిడ్, హార్మోనల్ ఇన్ బ్యాలన్స్, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు,బలహీనత, రక్తహీనత మొదలైన సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ క్రింది జ్యూస్ లు చాలా మంచి రిలీఫ్ ను ఇస్తాయి._*
👉🏼 సంతోషంగా జీవించాలి అంటే.. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అన్నం,పప్పులు, నూనెలు, మాంసం,పండ్లు తింటున్నా పోషకారలోపంతో బాధపడేవారు వున్నారు.
👉🏼 ఎన్నో అనారోగ్యాలకు కారణం ఈ పోషకాహార లోపం. విటమిన్లు, మినరల్స్ లోపాన్ని సరిచేయాలి అంటే న్యూట్రిషన్ సప్లిమెంట్ లు తీసుకోవడం కంటే ఆహారంలో కొంచెం మార్పులు చేసుకుని కొద్దిగా మన జీవనశైలిని మార్చుకోవడం మంచిది.
👉చిన్న ప్రయత్నంతో గొప్పమేలు చేసే కూరగాయలు, ఆకుకూరల రసాలతో పోషకాహార లోపాలకి, శారీరక సమస్యలకి చెక్ పెట్టొచ్చు. విటమిన్లు, మినరల్స్ తో పాటు అధిక ఫైబర్ ని అందించే కొన్ని అద్భుతమైన జ్యూస్ లు మీకోసం చెప్తున్నాము.
1). ఆకు కూరల జ్యూస్:
👉తయారీకి కావల్సిన పదార్థాలు:
👉పుదీనా, కొత్తిమీర, తులసి ఆకులు,తేనె,నిమ్మచెక్క, మంచు నీళ్లు. అన్ని ఆకులు కలిపి గుప్పెడు ఉంటే చాలు.
” తయారీ విధానం “:
👉🏼 ఈ ఆకులన్ని మిక్సీ పట్టాలి.తర్వాత నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఒక నిమ్మచెక్కని పిండి రుచికి తగినంత తేనె కలిపి నెమ్మదిగా తాగాలి.
2). కూరగాయలు జ్యూస్:
👉🏼 తయారీకి కావలసిన పదార్థాలు:
👉🏼టమోటా, బీర, గుమ్మడి, కీరకాయ,పొట్లకాయ లతో పాటు జ్యూస్ కి అనువైన అన్ని కాయలను ఉపయోగించవచ్చు.
” తయారీ విధానం “:
👉🏼 కూరగాయలను ముక్కలుగా కోసి వాటిని మిక్సీలో వేసి అందులో తగినన్ని నీళ్లు కలిపి పలుచగా చేసి ఒక నిమ్మచెక్కని అందులో పిండాలి. రుచి కోసం కొద్దిగా తేనె ని కలపాలి. ఈ జ్యూస్ ని కనీసం వారానికి ఒకసారి అయినా తీసుకోవాలి.
3).మునగాకు జ్యూస్:
👉🏼 తయారీకి కావాల్సిన పదార్థాలు:
👉🏼 మునగాకు, కరివేపాకు, తేనె, నిమ్మ చెక్క, మంచి నీళ్ళు.
” తయారీ విధానం “:
👉🏼 ముందుగా ఆకుల్ని మిక్సీ పట్టాలి. దానికి తగినన్ని నీళ్లు కలిపి పలుచగా చేసుకుని అందులో నిమ్మచెక్కని పిండి తేనె కలుపుకుని తాగాలి.
4). పాలకూర జ్యూస్:
👉🏼 తయారికి కావాల్సిన పదార్థాలు:
👉🏼 పాలకూర, కరివేపాకు, తేనె, నిమ్మచెక్క మరియు మంచి నీళ్ళు.
” తయారీ విధానం “:
👉🏼 ఆకులను మిక్సీ పట్టి తగినన్ని నీళ్లు కలిపి పలుచగా చేసి అందులో నిమ్మచెక్కని పిండి కొద్దిగా తేనె కలిపి తాగాలి.
5).గోధుమ గడ్డి జ్యూస్:
👉🏼 ఎనిమిది రోజుల వయసున్న గోధుమ గడ్డిని ముక్కలుగా కత్తిరించుకుని ఆ ముక్కల్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా చేయాలి. తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి వడగట్టాలి.
👉🏼 ఈ జ్యూస్ ని ఉదయం అల్పాహారం కి అరగంట ముందు అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి.
6).తవుడు జ్యూస్:
👉🏼 ఉదయం తాగాలి అంటే రాత్రి పూట 3 స్పూన్ల తవుడుని గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉంచుకోవాలి.
ఉదయం ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులోకి ఒక నిమ్మచెక్క పిండి కొద్దిగా తేనె కలిపి తాగాలి.
7).క్యారెట్, బీట్రూట్ జ్యూస్:
👉🏼 బీట్రూట్, క్యారెట్ ముక్కలకు కొన్ని నీళ్లు కలిపి మిక్సీ పట్టి అందులో ఒక నిమ్మచెక్కని పిండి కొంచెం తేనెను కలిపి త్రాగాలి.