Politics

కొత్త లుక్ లో మోదీ.. సఫారీ, టోపీ ధరించి టైగర్ రిజర్వ్​కు.

కొత్త లుక్ లో మోదీ.. సఫారీ, టోపీ ధరించి టైగర్ రిజర్వ్​కు.

కొత్త లుక్​లో మోదీ.. సఫారీ, టోపీ ధరించి టైగర్​ రిజర్వ్​కు..

కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బంధీపుర్​లోని టైగర్​ రిజర్వ్​ను సందర్శించారు. సఫారీ దుస్తులు, టోపీ ధరించిన ప్రధాని.. అటవీ శాఖ వాహనంలో టైగర్‌ రిజర్వ్‌లో తిరిగారు. “ప్రాజెక్ట్‌ టైగర్‌” ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేయనున్న పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సఫారీ దుస్తులు, టోపీలో ప్రత్యక్షమయ్యారు. కర్ణాటకలోని బంధీపూర్ టైగర్ రిజర్ను సందర్శించేందుకు ఆయన ఈ దుస్తుల్లో వచ్చారు.

కర్ణాటకలోని బంధీపూర్ టైగర్ రిజర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. “ప్రాజెక్ట్ టైగర్” ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేయనున్న పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు.

ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న అధికారులు… టైగర్ రిజర్వ్ ప్రధాని మోదీ

సఫారీ దుస్తులు, టోపీ ధరించిన ప్రధాని.. అటవీ శాఖ వాహనంలో టైగర్ రిజర్వ్ ్ను సందర్శించారు.

బంధీపుర్ టైగర్ రిజర్వ్ లోని ఓపెన్ జీప్లో సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించారు మోదీ.

ఈ టైగర్ రిజర్వ్ లోని కొంతభాగం చామరాజనగర్ జిల్లా.. మరికొంత భాగం మైసూరు జిల్లాల్లో విస్తరించి ఉంది. 1973లో పులుల్ని వాటి ఆవాసాల్ని రక్షించేందుకు రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాలను విస్తరించి 880 చదరపు కిలోమీటర్లతో ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించారు. ప్రస్తుతం బంధీపూర్ టైగర్ రిజర్వ్ విస్తీర్ణం 912 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ ప్రకారం.. పులి, దాని ఆవాసాలను రక్షించడానికి దేశవ్యాప్తంగా 30 రిజర్వ్ ను గుర్తించగా.. అందులో ఈ బంధీపూర్ టైగర్ రిజర్వ్ ఒకటి. దీంతో పాటు అంతరించిపోతున్న ఆసియా అడవి ఏనుగులకు ఇదే చివరి ఆశ్రయం. ఈ టైగర్ రిజర్వ్ ఎన్నో అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతులు కనిపిస్తాయి.