🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. అ యితే ఆ వ్యక్తికి అతను యమధర్మరాజని తెలియదు.
🌸యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు. ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే, కానీ దాహం అని అడిగినందుకు అతను యమధర్మరాజుకు నీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు.
🌿నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో, నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యముడిని… కానీ! నీవు తాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు.
🌸 కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని, యమధర్మరాజు ఆ వ్యక్తికి ఒక డైరీ ఇచ్చారు.
🌿నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అది జరిగి తీరుతుంది
కానీ గుర్తుంచుకో… నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే….
ఆ వ్యక్తి ఆ డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు.
🌸మొదటి పేజీలోనిది చదివాడు…
అందులో తన పక్కింటాయనకు “లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు” అది చదివి ఆ వ్యక్తి, అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు, అని రాశాడు.
🌿తర్వాత పేజీ చదివాడు…
“తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాసైయ్యి మంచి ఉద్యోగం రాబోతోంది ” అది చదివి అతడు ఫెయిల్ అయ్యిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు, అని రాశాడు.
🌸తర్వాత పేజీలో “తన స్నేహితురాలుకీ భర్తకీ కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురినీ ఒకటి చేస్తుంది” అని చదివి వెంటనే అలా జరగకూడదు, వారు విడిపోవాలని రాసాడు,
🌿ఈ విధంగా ప్రతి పేజీనీ చదువుతూ….
ఏదో వొకటి రాస్తూ…చివరికి…!
ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా…
ఈలోపే యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి డైరీని తీసుకుని,
🌸నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ, ఇతరులను చింతన చేయడంలోనే వృధా చేసుకున్నావు.
🌿 నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం ఇచ్చినా కూడా… స్వయంగా నువ్వే నీ జీవితాన్ని కష్టంలోకి నెట్టుకుని, చావుదాకా తెచ్చుకున్నావు
🌸నీ యొక్క మృత్యువు నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు యముడు. ఆ వ్యక్తి చాలా పశ్చాతాప పడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ తనువును చాలించాడు.
🌿భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నాడు.
కానీ మనము వ్యర్థ చింతన చేస్తూ ఇతరులకు చెడు చేస్తూ మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము.
🌸ఈ సంగమ యుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి
“మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి” అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు.
🌿కానీ మనము పర చింతన చేస్తూ సమయము వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం…స్వస్తి…🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸