Politics

ఏపీలో బీఆర్ఎస్‌కు చిక్కులు.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు రద్దు?..!!

ఏపీలో బీఆర్ఎస్‌కు చిక్కులు.. రాష్ట్ర పార్టీగా గుర్తింపు రద్దు?..!!

ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలని భావించిన భారత్ రాష్ట్ర సమితికి ఆదిలోనే చిక్కులు ఎదురయ్యాయి.

గాలింపు న్యూస్ ( స్టేట్ బ్యూరో ) ఆంధ్రప్రదేశ్‌లో స్టేట్ పార్టీ స్టేటస్ లేనందువల్ల ఇకపైన పోటీ చేస్తే కామన్ సింబల్ దక్కడం అనుమానమే. తెలంగాణలో కారు గుర్తుమీద పోటీ చేస్తున్నా ఏపీలో అలాంటి అవకాశం లేదు. స్పెషల్ రిక్వెస్టు ద్వారా అది సాకారమవుతుందో లేదో వేచి చూడాల్సిందే. స్వతంత్ర అభ్యర్థులు లేదా రిజిస్టర్డ్ పార్టీలకు ఆ గుర్తు ఇచ్చేలాగ బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు అవకాశం ఉంటుందనేది అనుమానమే. గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉంటుంది.