తీవ్రమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైన ప్లిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ముందుగా వేటిని తీవ్రమైన నేరాలుగా పరిగణించాలో గుర్తించాలని.. దీనిపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణ జులైలో ఉంటుందని తెలిపింది. అశ్వినీ ఉపాధ్యాయ్ అనే న్యాయవాది ఈ పిటిషన్ దాఖలు చేశారు.