Movies

హైదరాబాదులో కీరవాణి చంద్రబోసులకు ఘన సత్కారం.

హైదరాబాదులో కీరవాణి చంద్రబోసులకు ఘన సత్కారం.

హైదరాబాద్‌లోని శిల్ప కళావేదికలో తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ఆస్కార్‌ పురస్కారాన్ని గెలుచుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లను ఘనంగా సత్కరించింది.

ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ యాదవ్‌ గారు, ఎక్సైజ్ & పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ అనిల్ కుర్మాచ‌లం గారు పాల్గొని ప్రభుత్వం తరుపున వారిని సన్మానించి, జ్ఞాపికలను అందజేసిన వారికీ శుభాకాంక్షలు తెలిపారు