Press note:
సంక్రాంతి పండగ సందర్భంగా జనవరిలో “శ్రీ సాంస్కృతిక కళాసారథి” ఏర్పాటు చేసిన “మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్” (MFCL) టోర్నమెంట్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అందులో ఎంపికైన ముగ్గురు తెలుగు కార్మిక సోదరులను (ఉత్తమ ఆటగాళ్లు) పినకాన తులసి రామ్, సీడి దిలీప్ వరప్రసాద్, మరియు అక్కరమని గణేష్ కుమార్ లను, ICA (Indoor Cricket Association, Singapore) వారు దుబాయ్ లో 24-29 ఏప్రిల్ 2023 జరిగబోయే క్లబ్ వరల్డ్ సిరీస్, ఇండోర్ క్రికెట్ టోర్నమెంట్ కు సింగపూర్ నుండి ICA తరఫున ఎంపిక చేసి పంపుతున్నారని, టీం కెప్టెన్ గా రామ్ మడిపల్లి వ్యవహరించనున్నారు అని సింగపూర్ ఇండోర్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిథులు మురళీధరన్ గోవిందరాజన్, శంకర్ వీర తెలియచేసారు.
“మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్” (MFCL) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ముగ్గురు ఆటగాళ్ళు దుబాయ్ ఇన్డోర్ క్రికెట్ సిరీస్ కి ఎంపిక అవ్వడం పట్ల టోర్నమెంట్ నిర్వాహుకులు గిరిధర్ సారాయి, నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్ , సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి , మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, S కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు తదితరులు హర్షం వెలిబుచ్చారు.
ఈ సందర్భంగా “శ్రీ సాంస్కృతిక కళాసారథి” అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ సంస్థ తరఫున క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసి, ఈ టోర్నమెంట్ లో కూడా విజయకేతనం ఎగురవేయాలని ఆకాక్షించారు.
టోర్నమెంట్ మరిన్ని వివరములకు:
https://www.clubworldseries.com/