Politics

ఆంద్రప్రదేశ్ లో స్టిక్కర్స్ వార్

ఆంద్రప్రదేశ్ లో  స్టిక్కర్స్ వార్

అధికార పార్టీ అధికారికంగా చేపట్టిన ఇంటింటికి సీఎం జగన్ పాలనను తెలియజేస్తూ.. వేస్తున్న స్టిక్కర్స్ పై ప్రతి పక్ష పార్టీ జనసేన మొదలు పెట్టిన మేము నమ్మకం జగన్ .. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా ఓన్ చేసుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో స్టిక్కర్స్ వార్ మూడు పార్టీల ముక్కలాటగా మారింది. దీంతో ఇళ్ల గోడలు మూడు పార్టీల స్టిక్కర్లతో నిండిపోతున్నాయి.

సంక్షేమ పాలన ఇస్తున్నామని, మళ్లీ గెలవాల్సింది గెలిపించాల్సింది జగనే అన్న లక్ష్యంతో వైసీపీ ఇంటింటికీ స్టిక్కర్లు వేస్తోంది. ఏం మాట్లాడాలి.. స్టిక్కర్లు ఎలా ఎక్కడ వెయ్యాలనే దానిపై ఏకంగా వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చి మరీ వైసీపీ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందులో ఇంటింటికీ ఎమ్మెల్యేలు కూడా తిరుగుతున్నారు. వైసీపీకి పోటీగా తిరుపతిలో ఇప్పటికే జనసేన స్టిక్కర్లు వేస్తోంది. వైసీపీ స్టిక్కర్‌లో మా నమ్మకం జగన్ అంటే, మాకు నమ్మకంలేదు జగన్.. మా నమ్మకం పవన్ అంటూ రాసుకొచ్చింది.

అటు జనసేన ఈ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టిందో లేదో.. దాన్నే టీడీపీ కూడా అందిపుచ్చుకుంది. కృష్ణా జిల్లాలో కేశినేని ఆధ్వర్యంలో ఈ స్టిక్కర్లు అంటించుకుంటూ వెళ్తున్నారు. నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గాలంటే, విద్యుత్ చార్జీలు తగ్గాలంటే, ఆర్టీసీ చార్జీలు తగ్గాలంటే, చెత్తమీద పన్ను పోవాలంటే, అన్నా క్యాంటీన్లు మళ్లీ తెరవాలంటే, చంద్రన్న బీమా రావాలంటే, జాబులు రావాలంటే… సైకిల్రావాలి.. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అంటూ అందులో ఉంది.

వచ్చిన పార్టీలు స్టిక్కర్లు వేసుకుంటూ పోతుంటే, ఇళ్ల గోడలు నిండిపోతున్నాయి. ఒకే ఇంటిపై రెండు,మూడు పార్టీల సింబల్స్‌ కనిపించడం ఆసక్తికరంగా మారింది