విజయవంతముగా ముగిసిన తానా ఫౌండేషన్ మెగా ఐ క్యాంపు .
అంగలూరు , కృష్ణా జిల్లా నందు తానా ఫౌండేషన్ , శంకర్ ఐ ఫౌండేషన్ సంయక్తముగా ఏప్రెల్ తొమ్మిదవ( April 9th 2023) తేదీ మెగా ఐ
క్యాంపు నిర్వహించడం జరిగినది . సుమారు నాలుగు వందలు పైగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికీ కళ్ళ జోళ్ళు పంచడం జరిగినది . సుమారు డెబ్భై అయిదు కంటి ఆపరేషన్ కొరకు చేయడం జరిగినది . కార్యక్రమానికి హాజరైన గ్రామ పెద్దలు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు . ఈ మెగా ఐ క్యాంపు కార్యక్రమం శ్రీ దుగ్గిరాల చిన్నబ్బాయి మరియు శ్రీమతమ్మ
జ్ఞాపకార్థం శ్రీమతి శిరీష యలమంచిలి కోలా గారు స్పాన్సర్ చెయ్యడం జరిగినది . తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.