*ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
అంతర రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా ను అరెస్ట్. చేయడంలో కీలకపాత్ర పోషించిన డిసిపి మేరీ ప్రశాంతి నందిగామ ఏసిపి నాగేశ్వర రెడ్డి సిఐ సతీష్
ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రంలలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధులలో ఒంటరిగా వున్న మహిళల మెడలలో మొత్తం 16 చైన్ స్నాచింగ్ చేసిన అంతర రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా
చైన్ స్నాచింగ్ ముఠాను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన డిసిపి మేరీ ప్రశాంతి ఏసిపి నాగేశ్వర రెడ్డి సీఐ సతీష్ ఎస్సైలు సురేష్ పండు దొర కు పోలిస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., అభినందించి, రివార్డులు ఇచ్చి సత్కరించరు
ఈ కేసులో పనిచేసిన HC తిరుపతి కానిస్టేబుల్ పూర్ణ సంతోష్ కు రివార్డ్ లు అందజేసిన కమిషనర్
* దర్యాప్తునకు సహకరించట్లే
హైదరాబాద్: పదోతరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దర్యాప్తునకు సహకరించడం లేదని అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. సంజయ్ తన ఫోన్‌ను పోలీసులకు అప్పగించకుండా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. ఆయన ప్రవర్తన సరిగాలేదని, తన ఫోన్‌ను పోలీసులకు అప్పగించేలా ఆదేశించాలని కోరారు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌కు కాలంచెల్లిపోయిందని తెలిపారు. సంజయ్‌కి ఈ నెల 5న హనుమకొండ కోర్టు రిమాండ్ విధించింది. ఈ ఆదేశాలను కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఏకసభ్య ధర్మాసనం ఎదుట సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు వినిపించారు. పిటిషనర్‌కు ఇప్పటికే బెయిల్ వచ్చినందున క్వాష్ పిటిషన్‌కు కాలంచెల్లిపోయిందని తెలిపారు.
ఆయనకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని దిగువ కోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఆయన బయట ఉంటే ఆధారాలను నాశనం చేసి, చట్టం నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. ఈ కేసు దర్యాప్తులో ఆలస్యం జరిగే కొద్దీ ఆధారాల సేకరణ కష్టమవుతుందని, సంజయ్ మొబైల్ ఫోన్ కీలక ఆధారమని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. సంజయ్‌కు ఇప్పటికే బెయిల్ వచ్చినందున ఈ పిటిషన్‌లో వినేందుకు ఏమీ లేదని వ్యాఖ్యానించింది. సంజయ్ తరఫున న్యాయవాది భాస్కర్ వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్‌కు కాలం చెల్లిపోలేదన్నారు. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలు చట్ట విరుద్ధమని, వాటిని కొట్టేయాలని కోరారు. సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ పిటిషనర్ తరఫున వాదనలు వినిపిస్తారని.. అందుకు సమయం ఇవ్వాలని కోరారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసిన ధర్మాసనం.. ప్రభుత్వ వాదనలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని సూచించింది.
*సీపీ రంగనాథ్‍ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. బండి సంజయ్ హెచ్చరిక..!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లిని చూడకుండా చేశాడని గుర్తు చేశాడు. కేసీఆర్ కుటుంబ విలువలు తెలుసుకోవాలన్నారు.
తెలంగాణలో నిరుద్యోగం తప్పా ఇంకేమి లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై లాఠీ చార్జ్ చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నాడని విమర్శించారు. తనపై కావాలానే కేసు పెట్టారని చెప్పారు.
రాత్రి 12:30 గంటలకు ఉప్పల్ నుంచి మెట్రో రైలు..
తన ఫోన్ ను ఎవరు ఎత్తుకు పోయారని చెప్పారు. పోలీసులే తన మొబైల్ దొంగిలించారని ఆరోపించారు. ప్రశాంత్ వాట్సాప్ చేస్తే తాను సాయంత్రం 5 గంటలకు చూసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటలకే అయిపోయిందన్నారు.
అటు హనుమకొండ సీపీ రంగనాథ్ పై కూడా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. రంగనాథ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రంగనాథ్ విజయవాడ, ఖమ్మం, వరంగల్ లో ఏ దందాలు చేశాడో తెలుసన్నారు. వాటన్నింటిని బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు.
* యువగళం పాదయాత్రలో లోకేష్‍కు తాడిపత్రి డీఎస్పీ చైతన్య నోటీసులు – ఫ్యాక్షన్ నియోజకవర్గం కావడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని నోటీసులు – ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదని డీఎస్పీకి స్పష్టం చేసిన లోకేష్ – ప్రభుత్వ అవినీతిని కచ్చితంగా ఎండగడతానని డీఎస్పీకి తేల్చిచెప్పిన లోకేష్ – నోటీసులు తీసుకోవాలని లోకేష్‍ను కోరిన డీఎస్పీ చైతన్య – డీఎస్పీ ఇచ్చిన నోటీసులను తీసుకునేందుకు నిరాకరించిన లోకేష్ – పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి వెళ్లిన డీఎస్పీ చైతన్య
* అమరావతి
ఏపీ లో రోడ్డెక్కిన ప్రభుత్వ కాంట్రాక్టర్లు..
ప్రభుత్వ కాంట్రాక్టులు చేసినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆందోళన కు దిగిన కాంట్రాక్టర్లు..
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ ఆర్ అండ్ బి హెచ్ఒడి భవనం వద్ద ప్లకార్డులతో నిరసనలు తెలిపిన కాంట్రాక్టర్లు
నిరసనలో పాల్గొన్న
బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు.
రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులను , పంచాయితీరాజ్ అధికారులను కలిసి బిల్లులు చెల్లించాలంటూ వినతి పత్రం వినతి పత్రాలు ఇచ్చిన కాంట్రాక్టర్లు
దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించక పోతే ప్రభుత్వం పై పోరాటం తప్పదు అని హెచ్చరిక..
ఆత్మహత్యల నుండి కాంట్రాక్టర్లను రక్షించండి,
సీనరేజ్, ఇసుక పాలసీలను క్రమబద్ధీకరించండి అంటూ ప్లకార్డుల తో ప్రదర్శన
లోప భూయిష్టమైన సి ఎఫ్ ఎం ఎస్ ఫేజ్ 2 మాద్యూల్ ను తక్షణం సరి చేయాలి అంటూ డిమాండ్..
కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బకాయిలు మే ఒకటవ తేదీ లోపు చెల్లించక పోతే ప్రభుత్వ పనులన్నీ నిలిపి వేస్తాం అల్టిమేటం ఇచ్చిన కాంట్రాక్టర్లు..