DailyDose

TNI. నేటి తాజా వార్తలు. లండన్ వెళుతున్న జగన్ తదితర విశేషాలు..

TNI. నేటి తాజా వార్తలు. లండన్ వెళుతున్న జగన్ తదితర విశేషాలు..

*కుటుంబ సమేతంగా లండన్ వెళ్లనున్న సీఎం జగన్

లండన్ లో చదువుకుంటున్న జగన్ కుమార్తె

కుమార్తెను చూసేందుకు లండన్ వెళ్తున్న సీఎం జగన్ దంపతులు

ఈ నెల 21న బయల్దేరే అవకాశం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి లండన్ వెళ్తున్నారు. తన భార్య భారతితో కలిసి ఆయన లండన్ పర్యటనకు వెళ్లబోతున్నారు. జగన్ కుమార్తె లండన్ లో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జగన్ దంపతులు తన కుమార్తె వద్దకు లండన్ కు వెళ్తుంటారు. ఈ నెల 21న జగన్ దంపతులు లండన్ కు బయల్దేరే అవకాశం ఉంది. వారం రోజుల పాటు వీరు లండన్ లో గడపనున్నారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనది. గత ఏడాది జగన్ కూతురు డిగ్రీ పట్టా పొందారు. ఆ సందర్భంగా జగన్, భారతి లండన్ కు వెళ్లారు. 2019 నుంచి ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో జగన్ లండన్ వెళ్లడం ఆనవాయతీగా మారింది.

*విశాఖపట్నం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ కు తెలంగాణా ప్రభుత్వం సిద్దం.

సింగరేణి ఆధ్వర్యంలో సీఎండీ ఆదేశాల మేరకు ప్లాంట్ ను సందర్శిస్తున్న ముగ్గురు డైరెక్టర్లు.

సీఎం సూచనల మేరకు స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం.

*యువగళం పాదయాత్రలో లోకేష్‍కు తాడిపత్రి డీఎస్పీ చైతన్య నోటీసులు – ఫ్యాక్షన్ నియోజకవర్గం కావడంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని నోటీసులు – ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయట్లేదని డీఎస్పీకి స్పష్టం చేసిన లోకేష్ – ప్రభుత్వ అవినీతిని కచ్చితంగా ఎండగడతానని డీఎస్పీకి తేల్చిచెప్పిన లోకేష్ – నోటీసులు తీసుకోవాలని లోకేష్‍ను కోరిన డీఎస్పీ చైతన్య – డీఎస్పీ ఇచ్చిన నోటీసులను తీసుకునేందుకు నిరాకరించిన లోకేష్ – పాదయాత్ర నిర్వాహకులకు నోటీసులు ఇచ్చి వెళ్లిన డీఎస్పీ చైతన్య

*Media invitation

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి (12.04.23) నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొంటారు. 13వ తేదీ నిమ్మకూరులో నిర్వహించే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో టీడీపీ అధినేత పాల్గొంటారు.

*ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరితో మాకు సంబంధం లేదు. మాకు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే ముఖ్యం. ఏపీ ప్రభుత్వ స్పందనతో మాకు సంబంధం లేదు. ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలన్నది కేసీఆర్‌ విధానపరమైన నిర్ణయమని కేటీఆర్ స్పష్టం చేశారు.

*అమరావతి

ఏపీ లో రోడ్డెక్కిన ప్రభుత్వ కాంట్రాక్టర్లు..

ప్రభుత్వ కాంట్రాక్టులు చేసినా గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంపై ఆందోళన కు దిగిన కాంట్రాక్టర్లు..
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ ఆర్ అండ్ బి హెచ్ఒడి భవనం వద్ద ప్లకార్డులతో నిరసనలు తెలిపిన కాంట్రాక్టర్లు

నిరసనలో పాల్గొన్న
బిల్డింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు.

రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులను , పంచాయితీరాజ్ అధికారులను కలిసి బిల్లులు చెల్లించాలంటూ వినతి పత్రం వినతి పత్రాలు ఇచ్చిన కాంట్రాక్టర్లు

దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించక పోతే ప్రభుత్వం పై పోరాటం తప్పదు అని హెచ్చరిక..

ఆత్మహత్యల నుండి కాంట్రాక్టర్లను రక్షించండి,
సీనరేజ్, ఇసుక పాలసీలను క్రమబద్ధీకరించండి అంటూ ప్లకార్డుల తో ప్రదర్శన

లోప భూయిష్టమైన సి ఎఫ్ ఎం ఎస్ ఫేజ్ 2 మాద్యూల్ ను తక్షణం సరి చేయాలి అంటూ డిమాండ్..

కాంట్రాక్టర్కు చెల్లించాల్సిన బకాయిలు మే ఒకటవ తేదీ లోపు చెల్లించక పోతే ప్రభుత్వ పనులన్నీ నిలిపి వేస్తాం అల్టిమేటం ఇచ్చిన కాంట్రాక్టర్లు..

*11–04–2023
వైయస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం–తాడేపల్లి

– బీసీ కుల గణనపై అధ్యయనానికి కమిటీః మంత్రి చెల్లుబోయిన వేణు
– మిగతా రాష్ట్రాలకంటే ముందుగానే ఏపీలో కుల గణన చేపడదామని సీఎం జగన్ గారు చెప్పారు
– ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కులగణనపై అధ్యయనం: మంత్రి చెల్లుబోయిన వేణు
ఈ సందర్భంగా బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలు మనందరికీ ఆచరణీయమని అన్నారు. ఆయన అడుగు జాడల్లో మన నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గారు నడుస్తూ పూలే గారి వారసుడిగా నిలిచారన్నారు. రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసం బీసీ గణన చేపట్టాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి వేణు చెప్పారు. దీని కోసం కులగణన చేపడుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి అధ్యయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, పూలే గారి జయంతి సందర్భంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లు మంత్రి వేణు చెప్పారు. దేశంలోనే అందరి కంటే ముందుగా మన రాష్ట్రంలోనే కులగణన చేపట్టాలని సిఎం గారు ఆదేశించినట్లు మంత్రి వేణు వివరించారు.

సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం: మంత్రి జోగి రమేష్
గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్‌ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రి భాయ్‌ పూలేలు బీసీల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. వారి ఆశయాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్న రాష్ట్రం శ్రీ జగన్‌ గారి నాయకత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారేనని, దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి సామాజిక న్యాయం చేయలేదన్నారు మనల్ని చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా బీసీల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేస్తున్నాయన్నారు. బీసీలకు ఏ ఒక్క మేలూ చేయని చంద్రబాబు కూడా బీసీలపై చర్చకు సిద్ధమా అంటున్నాడు. బీసీలంతా గళమెత్తి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమని జోగి రమేష్‌ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన వారిలో రాష్ట్ర మంత్రులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, శ్రీ జోగి రమేష్, శ్రీ మేరుగ నాగార్జున, ఎంపీలు శ్రీ మార్గాని భరత్, నందిగం సురేష్, ఎమ్మెల్సీలు శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శ్రీ జంగా కృష్ణమూర్తి, శ్రీలేళ్ల అప్పిరెడ్డి, శ్రీ మొండితోక అరుణ్‌ కుమార్, శ్రీమతి పోతుల సునీత, ఎమ్మెల్యే శ్రీ కైలే అనిల్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి శ్రీమతి కిల్లి కృపారాణి, అగ్రికల్చరల్‌ మార్కెంటింగ్‌ సలహాదారు శ్రీ బత్తుల బ్రహ్మానందరెడ్డి, విజయవాడ సిటీ పార్టీ అధ్యక్షుడు శ్రీ బొప్పన భవకుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీ నారాయణ మూర్తి, శ్రీమతి నారమల్లి పద్మజ, పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
—————-

*

నీట్ పరీక్షకు ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

దేశవ్యాప్తంగా నీట్ ఏప్రిల్ 6 తో ముగిసిన దరఖాస్తుల గడువు అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ ఈ నెల 11 నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం నీట్ దరఖాస్తులకు తుది గడువు పొడిగింపు జాతీయ స్థాయిలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల తుది గడువును మూడ్రోజులు పెంచారు. వాస్తవానికి నీట్ దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 6 తోనే ముగిసింది.

అయితే, పలు సమస్యల వల్ల సకాలంలో దరఖాస్తు చేయలేకపోయామని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరిగణనలోకి తీసుకుంది. ఏప్రిల్ 11 నుంచి 13వ తేదీ వరకు నీట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది.

ఏప్రిల్ 13వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, రాత్రి 11.59 గంటల వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని వెల్లడించింది. అటు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ అప్లికేషన్లలో పొరపాట్లను సవరించుకునేందుకు ఎన్టీఏ తాజాగా కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకువచ్చింది.

నీట్… ఇలా…

దేశవ్యాప్తంగా మే 7 న నీట్ పరీక్ష…

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష
మొత్తం 13 భాషల్లో నీట్
తెలుగులోనూ నీట్ రాసే వెసులుబాటు
పెన్ను, పేపర్ విధానంలో పరీక్ష
ఎన్టీఏ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల సమాచారం
మొత్తం 499 నగరాలు, పట్టణాల్లో నీట్ పరీక్ష నిర్వహణ

ఎంబీబీఎస్ , డెంటల్ కోర్సు, ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, ఆయుష్‌లోని వెజిటేరి కోర్సులు,(ICAR) అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్ కమ్యూనిటీ సైన్స్, పారామెడికల్ మరియు నర్సింగ్ కోర్సులకు B.Sc అల్లైడ్ కొర్స్, ఫోజీయోతెరఫి ఇంజనీరింగ్ కొర్స్ అడ్మిషన్లు జరుగుతున్నాయి.