స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయిన చిరంజీవి అనేక చిత్రాలతో అలరించారు. వాటిలో తన వైవిధ్యమైన నటన చూపిస్తూ టాలీవుడ్ లో బాస్ గా మారారు. ఇక రాజకీయాల్లో అడుగు పెట్టిన ఆయన సినిమాలకు కొద్ది కాలం గ్యాప్ ఇచ్చారు. తర్వాత మళ్లీ ఖైదీ నెం 786 చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
దీన్ని విజయవంతంగా కొనసాగిస్తూ దూసుకుపోతున్నారు. అయితే మెగాస్టార్ ఇంట్లో ఖరీదైన కార్లకు కొదవలేదు. అలాంటిది తాజాగా ఆయన అత్యంత ఖరీదైన కారు ఒకటి కొన్నారు. కేవలం దాని రిజిస్ట్రేషన్ కోసమే సుమారుగా రూ. 5 లక్షలు ఖర్చు చేశారు. ఇక ఆ కారు పూర్తి ధర తెలిస్తే నోరు వెళ్లబెట్టాల్సిందే. మరి ఆ కారు గురించి తెలుసుకుందామా.
సెకండ్ ఇన్నింగ్స్: సుమారు 40 సంవత్సరాలుగా తెలుగు చిత్రసీమలో హవాను చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఏక కాలంలో సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక వాల్తేరు వీరయ్య మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు.
తన మార్క్ చూపించి: బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటించిన ఈ చిత్రంలో వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారంతో చిరంజీవి కనిపించిన విషయం తెలిసిందే. ఇక మాస్ మహారాజా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన మార్క్ చూపించాడు. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఓటీటీలోనూ సత్తా చాటింది. ఫిబ్రవరి 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
కోలీవుడ్ స్టార్ హీరో: ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరుకి జోడీగా మిల్కీ బ్యూటి తమన్నా నటించనుండగా.. మహానటి కీర్తి సురేష్ చెల్లెలుగా కనిపించనుంది. ఈ చిత్రం కోలీవుడ్ స్టార్ అజిత్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి.
సెంటిమెంట్ గా నెంబర్: ఇక చిరంజీవి వ్యక్తిగత విషయాల్లోకి వస్తే ఆయన గ్యారేజీలో కాస్ట్ లీ కార్లకు కొదవలేదు. ఆయన దగ్గర రోల్స్ రాయిస్ స్పెషల్ ఎడిషన్ తోపాటు మరికొన్ని లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొక కారు కొన్నారు చిరంజీవి. ఈ కారు నెంబర్ ప్లేట్ కోసం సుమారు రూ. 4.70 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఎందుకంటే ఆ నెంబర్ చిరంజీవికి సెంటిమెంట్ అయిన 09 జీబీ 1111 నెంబర్.
బ్లాక్ కలర్.. రిజిస్ట్రేషన్: 1111 నెంబర్ చిరంజీవికి సెంటిమెంట్ ఉంది. ఆయన ప్రతి కారు నెంబర్ కు ఈ నెంబరే ఉంటుంది. అందుకే ఈ ఫ్యాన్సీ నెంబర్ కోసం అంత ఖర్చు చేశారు. ఇక ఆయన కొన్న కారు విషయానికొస్తే అది టయోటా వెల్ ఫైర్ (Toyota Vellfire). దీని విలువ దాదాపుగా రూ. 2 కోట్లు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి రూ. 1.90 కోట్లు అని తెలిసింది. బ్లాక్ కలర్ లో తీసుకున్న ఈ కారు రిజిస్టేషన్ కూడా పూర్తయిందట.