దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో సెషన్లోనూ లాభాలతో ముగిసాయి.సెన్సెక్స్ 235
పాయింట్లు పెరిగి 60,393 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు ఎగిసి 17,812.40 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని షేర్లు లాభాల్లోనే ముగిసాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మా,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సూచీలు 1-2 శాతం వరకు పెరగగా,ఎఫ్ఎంసిజి, క్యాపిటల్ గూడ్స్ పేర్లలో కొంత అమ్మకాలు కనిపించాయి.
నిఫ్టీలో దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఐషర్ మోటార్స్ అత్యధికంగా లాభపడగా, పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్టీపిసి, నెస్లే ఇండియా, ఒఎన్ఆసి, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి.