Politics

సుఖేష్ సంచలన లేఖ.. సిస్టర్ అంటే కవిత అంటూ వాట్సాప్ చాట్ రిలీజ్

సుఖేష్ సంచలన లేఖ.. సిస్టర్ అంటే కవిత అంటూ వాట్సాప్ చాట్ రిలీజ్

ఢిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన కేటుగాడు సుఖేష్‌ చంద్రశేఖర్‌ నుంచి సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈసారి జైలు నుంచి సుఖేష్‌ మరో లేఖ విడుదల చేశాడు. సీజేఐతో పాటు కేంద్ర హోం మంత్రి, సీబీఐతో పాటు ఈడీకి సుఖేష్‌ లేఖ రాశాడు. అందులో కవితతో జరిపిన ఛాటింగ్‌ ఇదేనవంఊట విడుదల చేసి చర్చకు దారి తీశాడు.

లిక్కర్‌ వ్యాపారంలో వచ్చిన డబ్బును హైదరాబాద్‌ నుంచి ఆసియా దేశాలకు హవాలా మార్గాల ద్వారా మళ్లించినట్లు సుఖేష్‌ వెల్లడించాడు. హవాలా లావాదేవీలను ఢిల్లీ నుంచి జరపవద్దని.. ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ తనకు సూచించారని సుఖేష్‌ లేఖలో తెలిపాడు. ఈ లావాదేవీల్లో కేజ్రీవాల్‌, సత్యేంద్ర జైన్‌, కవిత పాత్ర ఉందంటూ ఆరోపించాడు సుఖేష్‌. ఇది ఇక్కడితోనే ఆగలేదు..

కవితతో తాను జరిపిన వాట్సాప్‌ ఛాట్‌ ఇదేనంటూ విడుదల చేశాడు సుఖేష్‌. రూ. 15 కోట్ల హవాలా మనీ డెలివరీ చేసినట్లు కవితకు సుఖేష్‌ ఆ ఛాటింగ్‌లో వెల్లడించగా.. అరుణ్‌తో మాట్లాడాలని ఆమె సూచించినట్లు ఉంది.

ఇదిలా ఉంటే.. తెలుగు రాని సుఖేష్‌ తెలుగు పదాలతో ఛాటింగ్‌ చేయడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అక్కా అంటూ పలుమార్లు చాట్‌లో సంభోధించాడు సుఖేశ్‌. డబ్బు డెలివరీ చేశానంటూ వాట్సప్‌ చాట్‌లో పేర్కొన్నాడు సుఖేశ్‌. స్పోకెన్‌ టూ మనీష్‌ అని రిప్లై కూడా ఇచ్చాడు.

సుఖేష్‌ చంద్రశేఖర్‌ ప్రస్తుతం ఢిల్లీ మండోలి జైలు కాంప్లెక్స్లో ఉన్నాడు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన సుఖేశ్‌ ఆప్‌ నేతలపై సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం కేజ్రీవాల్‌కు వందల కోట్ల ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో సంచలన విషయాలు వెల్లడించాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ . కేజ్రీవాల్‌, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్రజైన్‌ ఆదేశాలపై హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌లో రూ.15 కోట్ల డబ్బులు ఎమ్మెల్సీ కారులో ముట్టజెప్పినట్టు ఆరోపించాడు. అరుణ్‌ రామచంద్ర పిళ్లై ద్వారా డబ్బులు అందచేసినట్టు లేఖలో పేర్కొన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆయన సహాయకులు సౌత్ గ్రూప్, కె.కవిత తో జరిపిన లావాదేవీల అంశాన్ని లేఖలో పేర్కొన్నాడు సుఖేశ్. ‘‘ప్రజాప్రతినిధులుగా ఎన్నికై, అధికారంలో ఉన్న వ్యక్తులతో పాటు అవినీతిపై వివిధ ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్న వ్యక్తులకు మధ్య జరిగిన చాటింగ్‌ల స్క్రీన్‌షాట్‌ల కాపీలను నేను మీ దృష్టికి తెచ్చాను. అరవింద్ కేజ్రీవాల్, అతని సహచరులు సౌత్ గ్రూప్, ఇండో స్పిరిట్ దాని యజమానులు అరుణ్ పిళ్లై, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కె కవిత లావాదేవీల అంశాన్ని రుజువు చేస్తుంది… ముఖ్యంగా నా నుంచి చేరవేయబడ్డ నగదు అంశం కూడా.

ఇది దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, కైలాష్ గెహలట్, BRS పార్టీకి చెందిన కె. కవితల నగదు లావాదేవీలు అంశం ఉంది. 2020 లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు తాను నగదు పంపించడం జరిగింది. ఇందుకు సంబంధించి తనకు ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు మధ్య జరిగిన సంభాషణలు జత చేస్తున్నాను.

అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్‌లకు చెందిన రూ. 15 కోట్లు హైదరాబాద్‌లోని BRS పార్టీకి చెందిన కె. కవితకు తనను డెలివరీ చేయమని అడిగారని పేర్కొన్న సుఖేశ్. ఢిల్లీ లిక్కర్ లైసెన్సుల కోసం కె. కవితతో జరిపిన లావాదేవీలు, కిక్స్ బ్యాక్‌గా ఉన్న మొత్తాలు ఆమ్ అద్మీ పార్టీకి అనుకూలంగా హైదరాబాద్ నుండి హవాలా ద్వారా వివిధ ఆసియా దేశాలకు లాండరింగ్ చేయబడ్డాయి…బదిలీ చేయబడ్డాయి.

అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ నుండి ఎటువంటి లావాదేవీలు నిర్వహించకూడదని ప్రత్యేకంగా పేర్కొన్నారు. కోవిడ్ కాలంలో నగదు లావాదేవీలు అన్ని అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ అద్మీ పార్టీ కోసం హైదరాబాద్ నుండి నిర్వహించబడ్డాయి. జోడించిన చాట్ కాపీలలోని కొన్ని వివరాలను నేను ఇందుమూలంగా ప్రస్తావిస్తున్నాను.

చాట్ 1లో, నాకు మరియు TRS పార్టీకి చెందిన కె. కవితకు మధ్య జరిగిన సంభాషణ.

చాట్‌లో…

ఎ కె బ్రో అంటే అరవింద్ కేజ్రీవాల్

ఎస్ జే బ్రో అంటే సత్యేందర్ జైన్.

మనీష్ అంటే మనీష్ సిసోడియా.

అరుణ్ అంటే అరుణ్ పిళ్లై.

JII అంటే జూబ్లి హిల్స్ కోడ్, ఇది సాధారణంగా కె కవిత లావాదేవీలు జరిగే గెస్ట్ హౌస్.

ఆఫీస్ అంటే టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం.

ప్యాకేజ్ అంటే రూ.15 కోట్ల నగదు.

సిస్టర్ అంటే కె కవిత.

Hyd అంటే హైదరాబాద్.

ఇవి నాకు, వివిధ AAP సీనియర్ నాయకులకు మధ్య జరిగిన 703 చాట్‌ల 2 చాట్‌లు మాత్రమే.

అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ నుండి నాకు, నా కుటుంబానికి నిరంతరం ఒత్తిడి ఉన్నందున, నేను దీనిపై దర్యాప్తు చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.

నేను పూర్తిగా సహకరిస్తాను.

తనకు ఆమ్ అద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్య అనేక రకాల ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి.

లిక్కర్ గేట్‌పై విచారణ కొనసాగుతున్నందున, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ప్రమేయం ఉన్న ఆమ్ అద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్, టీఆర్ఎస్ నుంచి కె. కవితల అనుబంధాలను ఈ అప్లికేషన్, చాట్‌లు చూపుతున్నాయి.

ఈ చాట్ ఇందుకు సహాయపడుతుంది.

దర్యాప్తు చేసినప్పుడు తాను పూర్తిగా సహకరిస్తాను.

నాకు, AAPకి మధ్య జరిగిన అన్ని లావాదేవీల వాయిస్ నోట్స్‌తో పాటు అన్ని ఇతర చాట్‌లను కూడా సమర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

పైన పేర్కొన్న సీనియర్ నాయకులు. అప్లికేషన్‌ను ఎవరి అభ్యర్థన, ఒత్తిడి లేదా కారణంతో కాకుండా సొంత ఇష్టానుసారం రాస్తున్నాను.

ఈ అంశంలో మీ జోక్యాన్ని కోరుతున్నాను… దీనిపై వివరణాత్మక దర్యాప్తును ఆదేశించాలని కోరుతున్నాను. అని లేఖలో సుఖేష్‌ కోరాడు.