NRI-NRT

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం:గుట్టుచప్పుడు కాకుండా రష్యాకు ఈజిప్టు ఆయుధాలు..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం:గుట్టుచప్పుడు కాకుండా రష్యాకు ఈజిప్టు ఆయుధాలు..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం( Russia Ukraine War ) మొదలయ్యి సంవత్సరం దాటిపోయింది.ఎంతో మారణహోమం జరిగింది, ఇంకా జరుగుతోంది

ప్రపంచ దేశాలు చోద్యం చూసినట్టు చూస్తున్నాయి గాని, నిజానికి ప్రతిఒక్కరూ ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తిన్నారు.యుద్ధాన్ని ఆపే గట్టి ప్రయత్నం ఏ ఒక్క దేశం కూడా చేయడంలేదు.చరిత్రలో ఇదొక మాయని మచ్చగా మిగిలిపోక తప్పదు.అదంతా పక్కనబెడితే కొన్ని దేశాలు ఇంకా కొట్టుకొమ్మని ఆయుధాలు ( Weapons ) సరఫరా చేయడం కొసమెరుపు.

వాషింగ్టన్ పోస్ట్ ద్వారా లీక్ అయిన యూఎస్ ఇంటెలిజెన్స్ పత్రాల్లో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.మిడిల్ ఈస్ట్ లో అమెరికాకు మిత్రదేశంగా ఉన్న ఈజిప్టు, రష్యాకు సాయం చేసేందుకు సిద్ధం అయినట్లు బయటకు పొక్కింది.ఈజిప్టు రహస్యంగా దాదాపుగా 40,000 రాకెట్లను ఉత్పత్తి చేసి రష్యాకు సరఫరా చేయాలని ప్లాన్ వేస్తోంది.ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతేహ్ ఎల్-సిసి తన ఉన్నత సైనిక అధికారులతో సమావేశాన్ని నిర్వహించారని, అందులో రష్యాకు ఫిరంగి గుండ్లు మరియు గన్‌పౌడర్‌లను అందించడంపై చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

కాగా ఈ పరిణామాలు మీద అమెరికా అధికారులు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.ఈజిప్టు నిజంగా రష్యాకు ఇవ్వడానికి రాకెట్లను ఉత్పత్తి చేసుంటే మాతో సంబంధాలను తెంచుకోవాలని కనెక్టికట్ కు చెందిన జూనియర్ సెనెటర్ క్రిస్ మర్ఫి అన్నట్టు భోగట్టా.అమెరికా బాహాటంగానే ఉక్రెయిన్ కి సపోర్టు చేస్తున్న విషయం విదితమే.యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ జనవరి చివరిలో ఈజిప్టులో పర్యటించిన సమయంలో ఎల్-సిసితో ఆయన సమావేశం అయ్యారు.ఆ సమయంలో ఉక్రెయిన్ యుద్ధం వల్ల తీవ్ర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈజిప్టుకు అమెరికా సంఘీభావం తెలుపుతోందని బ్లింకెన్ అన్నారు.