Politics

ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్‌

ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్‌

సీఎం జగన్‌ ప్రకాశం జిల్లా: 2014-19 మధ్య ఇంటింటికి ఎంత మంచి జరిగింది, మా పాలన
హయాంలో జరిగిన మంచి ఎంత బేరీజు వేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్‌ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 అబద్ధాల బ్యాచ్‌ను నమ్మకండి. ఐదేళ్ల పాలనలో ఒక్క ఇంటి స్థలం ఇవ్వని బాబుకు ఏం మంచి చేశావని మా ఇంటి ముందు స్టిక్కర్‌ అంటిస్తానంటారని చంద్రబాబుని అడగండి.. రుణ మాఫీ చేస్తానని రైతులను చంద్రబాబు మోసం చేశారు’’ అని సీఎం మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని బుధవారం విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి నేరుగా వారి ఖాతాల్లో  జమ చేశారు.