Devotional

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం

తిరుమలలో భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం

TTD: కలియుగ దైవం శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీంతో తిరుమల దేవస్థానం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని టీటీడీ బోర్డు సైతం అనేక సౌకర్యాలను కల్పిస్తూ ఉంటుంది. వీరికి దర్శన భాగ్యం కల్పిస్తూ వసతి గృహాలను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సామాన్యుల నుంచి వీవీఐపీ వరకు తిరుమలలో వివిధ రకాల గదులు అందుబాటులో ఉన్నాయి. భక్తలు తాకిడి ఎక్కువ కావడంతో వసతి గృహాలతో పాటు కొన్ని అతిథి గృహాలు నిర్మించేందుకు టీటీడీ బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల ఓ అతిథి గృహం నిర్మాణానికి టెండర్లు నిర్వహించారు. దీనికి ఊహించని రీతిలో విరాళం కోట్ చేయడంతో అంతా షాక్ తింటున్నారు. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే?

తిరుమలలో అతిథి గృహాల నిర్మాణానికి టీటీడీ బోర్డు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రస్తుతం తిరుమలలో 7500 గదులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో రూ.50, రూ.100 తో పాటు రూ.5000 గదులుకూడా ఉన్నాయి. లేటేస్టుగా రూ.120 కోట్లతో గదులను ఆధునీకరించారు. గదుల్లో కొత్తగా ఫ్లోరింగ్, గ్రీజర్లు అందుబాటులోకి తెచ్చారు. పద్మావతి, ఎంబిసీ కార్యాలయాల్లోని గదులను ప్రముఖులకు కేటాయిస్తున్నారు. గదుల నిమాయకంలో పారదర్శకత పెంచేందుకు మార్చి 1 నుంచి ఫేస్ రీడింగ్ గుర్తింపు విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాగే ఆధారిత సేవలతో గదులను కేటాయిస్తున్నారు.

ఇదే సమయంలో కొందరు దాతలు టీటీడీలో వసతి గృహాలను నిర్మించి విరాళంగా ఇస్తున్నారు. లేటేస్టుగా వీడీసీలోని 493 అతిథి గృహం నిర్మాణానికి రెవెన్యూ కార్యాలయంలో టెండర్లు నిర్వహించారు. దీనికి చెన్నైకి చెందిన జీస్క్వేర్ రియల్టర్ సంస్థ రూ.25,77,77,777 విరాళంగా కోట్ చేసింది. ఈ అతిథి గృహాన్ని దాత సొంతంగా నిర్మించి టీటీడీ బోర్డుకు ఇవ్వాలి. వీటిలో ఓ గతిని దాతకు కేటాయిస్తారు. కంపెనీ పేరిట టెండర్ పొందిన వారికి 20 ఏళ్లు, వ్యక్తిగతంగా శాశ్వతంగా ఈ గది అందుబాటులో ఉంటుంది. ఒక అతిథి గృహం నిర్మాణానికి ఇంత విరాళం రావడం ఇదే రికార్డుగా చెబుతున్నారు.

ఇదిలా ఉండగా తిరుమలలోపర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇక్కడ ప్లాస్టిక్ బాటిళ్లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే తాగునీటి కోసం భక్తులకు రాగి, స్టీల్ బాటిళ్లను అందుబాటులో ఉంచింది. రాగి బాటిల్ ధర రూ.450, స్టీల్ బాటిల్ ధర రూ.200 గానిర్ణయించింది. అయితే ముందుగా వీటిని పద్మావతి విచారణ కార్యాలయంలో ఉంచారు. ఇది సక్సెస్ అయితే తిరుమల వ్యాప్తంగా ఈ బాటిళ్లను భక్తులకు అందించనున్నారు. వచ్చే వేసవిలో రద్దీ పెరగనున్నందున వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో నియంత్రణ పాటించేంచుందుకు చర్యలు తీసుకోనున్నారు.