Politics

కొత్త సచివాలయంలో సిద్ధమైన మంత్రుల ఛాంబర్లు

కొత్త సచివాలయంలో సిద్ధమైన మంత్రుల ఛాంబర్లు

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్ : ప్రపంచమే అబ్బుర పడేలా తెలంగాణ ప్రతీకగా నూతన సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అధికారులు, ఉద్యోగుల కోసం ఆహ్లాద భరితమైన విశాలమైన గదులు, ఛాంబర్లు, వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సచివాలయ నిర్మాణ ఫినిషింగ్ వర్క్స్​ను మంత్రి పరిశీలించారు. ఈ నేపథ్యంలో అధికారులతో కలిసి సచివాలయ ప్రాంగణమంతా తిరిగారు.