గుజరాత్ టైటాన్స్ × పంజాబ్ కింగ్స్టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టైటాన్స్
మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు
గత మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై అనూహ్య పరాజయం చవిచూసిన గుజరాత్ టైటాన్స్… ఇవాళ పంజాబ్ కింగ్స్ పై గెలిచి తీరాలన్న కసితో బరిలో దిగింది. గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా… బౌలర్లు తమ కెప్టెన్ నిర్ణయాన్ని వమ్ము కానివ్వకుండా, పంజాబ్ కింగ్స్ ను సమర్థంగా కట్టడి చేశారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ 25, శామ్ కరన్ 22, షారుఖ్ ఖాన్ 22, భానుక రాజపక్స 20 పరుగులు చేశారు.
అంతకుముందు, ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ (0), శిఖర్ ధావన్ (8) స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో పంజాబ్ కింగ్స్ కు శుభారంభం లభించలేదు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ 2, మహ్మద్ షమీ 1, జాషువా లిటిల్ 1, అల్జారీ జోసెఫ్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు