Politics

ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడు జగన్

ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడు జగన్

న్యూ ఢిల్లీ : దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడుగా ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్ ​మోహన్​ రెడ్డి నిలిచారు. భారత దేశంలో ప్రస్తుతం ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే. వీరిలో ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​​ జగన్​ మోహన్​ రెడ్డి రూ.510కోట్లు విలువైన ఆస్తులతో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆస్తుల విషయంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చిట్టచివరన ఉన్నారు. ఆమె పేరిట కేవలం 15 లక్షల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి. అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్​- ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్​(ఎన్​ఈడబ్ల్యూ) అనే సంస్థలు ఈమేరకు ఓ నివేదిక విడుదల చేశాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్​లను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు ఆయా సంస్థలు తెలిపాయి.