🌾అసలు ” అలిపిరి ” అనే పేరే ఒక విచిత్రమైన పేరు లాగా ఉంది కదా … ? మన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ ” అలిపిరి ” అనే పదం లేదు.
🌾అయితే, ” అలిపిరి ” అనే ఈ పదం ఎలా పుట్టింది … ?
🌾దీని వెనుక చరిత్ర ఏమిటి … ?
అనే విషయం మన చరిత్రని నిశితంగా గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన యదార్థ సంఘటలను గురించి మనం తెలుసుకోవచ్చు.
🌾పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం,” తిరుపతి ” నగరం ఇప్పటిలాగా లేదు.
🌾ఇప్పుడు ” అలిపిరి ” అని పిలుస్తున్న ప్రాంతానికి-
“అలిపిరి” అన్న పేరు కూడా లేదు.
అది ( 1656 – 1668 ) ప్రాంతం .
🌾ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం. శ్రీ కృష్ణ దేవరాయల అనంతరం జరిగిన ” రాక్షసి తంగడి & తళ్ళికోట ” మొ || యుద్ధాల తర్వాత, విజయనగరం రాజుల ప్రాబల్యం తగ్గింది. అప్పుడు నిజాం నవాబు రాయల సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు.
🌾ఆ సమయంలో హిందువులను, హిందూ సానుభూతిపరులను, సాధుసంతులను చాలా దారుణంగా హింసించారు.
🌾పదిహేడో శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు, హైదరాబాద్ నిజాం ప్రభుత్వం ఫర్మానా ( ఆర్డర్ ) మేరకు సుల్తాన్ అబ్దుల్లా – కుతుబ్ షా & వజీర్ల సైన్యం, ” ఆలీ ” అనే అత్యంత కరడుగట్టిన మహమ్మదీయుని నేతృత్వంలో, కడప, కర్నూలు, నెల్లూరులలో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ తరువాత ” ఆలీ ” సైన్యం తిరుపతికి చేరుకుంది.
🌾అప్పుడు, తిరుపతి చిన్న గ్రామం.
🌾 ఇప్పుడు ” మంచినీళ్ళ కుంట ” అని చెప్పుకుంటున్న
” నరసింహ తీర్థమే ” అప్పటి తిరుపతి గ్రామం.
🌾ఇక్కడ ఒక నరసింహ స్వామి మందిరం ఉంది, దానికి ప్రజలు నిత్యం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తుండేవారు. చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని ” నరసింహ తీర్థం రోడ్ ” అనే పిలుస్తారు.
🌾ఆలీని తిరుపతికి పైకి దండయాత్రకు పంపించటానికి మూల కారణాలు రెండు :
🌺ఒకటి : శ్రీ వేంకటేశ్వర స్వామి వారు అత్యంత శక్తివంతమైన దేవుడు అనీ & తిరుమల లాంటి దివ్య క్షేత్రం ఇంకొకటి లేదు, భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవమ్ విశ్వాసం భారత దేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన, ఈ దేవాలయం పై దాడి చేసి స్వామి వారి స్వరూపాన్ని పెకలించి కొండపై నుంచి తొలగించేస్తే, హిందువుల దేవుడు బలహీనుడనీ తద్వారా, ప్రజలందరూ ” అల్లా ” యే గొప్ప దేవుడని భావించి, ” ఇస్లాం ” మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి పిచ్చి ఆలోచన.
🌹రెండోది : శ్రీ కృష్ణ దేవరాయలు, భక్తితో స్వామి వారికి సమర్పించుకున్న విలువ కట్టలేనన్ని వజ్రాలు, వైఢూర్యాలు, కనక పుష్యరాగాలు, కెంపులూ & అపారమయిన బంగారం దోచుకెళ్ళి వాళ్ళ ఖజానా నింపుకుందామని.
🌾అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు, ” ఆలీ ” ( కమాండర్ ఇన్ చీఫ్ ) ని సమీపించి నీక్కావలసింది బంగారమే కదా ! మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ & పురుషుల వద్ద వున్న బంగారం అంతా ఇచ్చేస్తాం, దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో, కానీ మా స్వామి వారి జోలికి రావద్దు, ఆయన మా ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు.
🌾దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్చందంగా ఇచ్చిన బంగారం, ఆభరణాలు తీసుకుని, మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చెయ్యకపోతే నిజాం నవాబూ & ఢిల్లీ సుల్తాను నా తల తీసేస్తారు కాబట్టి, తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదిలాడు.
🌾సరిగ్గా ఇప్పుడు ” అలిపిరి ” అని పిలవబడుతున్న ప్రాంతాన్ని చేరుకోగానే, శ్రీ ఆది వరాహ స్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు.
🌾 మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు. అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయమూ లేకుండా అతని రెండు కళ్ళూ పోయాయి, దృష్టి పోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు.
🌾 దానితో ఏమీ సాధించకుండానే రిక్త హస్తాలతో వెనుదిరిగాడు “ఆలీ”.
🌾ఉర్దూ లేక హిందీ భాషలో ” ఫిర్ నా ” అంటే వెనక్కి మళ్ళడం, ” ఫిరే ‘ అంటే వెనక్కి మళ్ళాడు అని అర్థం.
🌾ఎప్పుడు, ఎక్కడా ఓటమెరుగని పరమ ఆ దుర్మార్గుడైన ఆలీ వెనుతిరిగిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న అందరూ ” ఆలీ ఫిరే, ఆలీ ఫిరే ” అని చెప్పుకునేవారు.
🌾కొన్ని సంస్థానాలకి సంబంధించిన గ్రామాలలో అయితే తిరుపతి ఆలయం మీదకు దండయాత్రకు వెళ్లిన ఆలీ తిరుపతిలోని ఒక ప్రదేశం నుంచి ముందుకెళ్లలేక వెనుదిరిగాడు ” ఆలీ ఫిరే “,
“ఆలీ ఫిరే” అని సూచిస్తూ … చాటింపులు సైతం వేయించారు.
🌾” ఆలీ ” ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటివారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు.🌾ఆ ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళేటప్పుడు లేదా వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్లారని ఎవరైనా అడిగినప్పుడు ” అలీ ఫిరే”
🌾ప్రదేశానికి వెళ్తున్నామని చెప్పేవారు.
కాలక్రమంగా ఆ ఆలీ ఫిరే అనే పదం – ఆలి పిరే గా రూపాంతరం చెంది ఇప్పుడు ” అలిపిరి గా స్థిరపడింది.
🌾ఇదీ మనమిప్పుడు ” అలిపిరి ” గా పిలుచుకునే ప్రదేశం యొక్క యదార్థమైన చరిత్ర.
ఈ విధంగా శ్రీవారి మహిమ వలన ఆలీ వెనుదిరిగిన కారణంగా, ఈనాడు మనం చూస్తున్న ” అలిపిరు ఏర్పడింది
శ్రీనివాసా గోవిందా
హరే కృష్ణ గోవిందా
🌺🔱🥭👏💦 సేకరణ