ఉదయం ఒడిదొడుకుల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. మెుదటి ట్రేడింగ్ సెషన్లో ప్రధాన సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నప్పటికీ.. ఆ తర్వాత తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలో స్వల్ప లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్ క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 38 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 15 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ బ్యాంక్ సూచీ 564 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 55 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా ఐటీ సంస్థ టీసీఎస్ మార్కెట్లను కిందకు డ్రాగ్ చేసింది. ఇదే క్రమంలో అందరూ ఇన్ఫోసిస్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
మార్కెట్లు ముగిసే సమయానికి ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఈ క్రమంలో ఎన్ఎస్ఈ సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, టీసీఎస్, బీపీసీఎల్, విప్రో, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, హీరో మోటార్స్, ఎల్ టి, గ్రాసిమ్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్ టెల్, సిప్లా, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.