🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿తిరుపతి వెళ్లి తిరుమలేశుని
దర్శిస్తే జీవితం ధన్యత చెందుతుందని,
భక్తుల పరిపూర్ణ విశ్వాసము.
అందుకనే ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుపతి తిరుమలేశుని
దర్శనం చేసుకుంటారు.
🌸సముద్రతీరానికి తిరుమలేశుడు వచ్చిన కారణం. 2010 సంవత్సరములో ఫిబ్రవరి 28 వ తేదీన
తిరుమల తిరుపతి దేవస్థానం వారు కన్యాకుమారి సముద్ర తీరాన ,
శ్రీ నివాస కళ్యాణాన్ని
బ్రహ్మాండంగా నిర్వహించారు.
🌿 లక్షలాది భక్తులు యీ
కళ్యాణోత్సవంలో
పాల్గొని తరించారు. అప్పుడే దేవస్ధాన
అధికారులకు కన్యాకుమారి లో వేంకటేశ్వరుని ఆలయం
నిర్మించాలనే ఆలోచన కలిగింది.
🌸తిరుపతి దేవస్ధానం వారు తమ కోరిక తెలుపగా ,కన్యాకుమారి వివేకానంద కేంద్రం వారు ఐదున్నర ఎకరాల భూమిని , తిరుపతి దేవస్థానానికి దానంగా యిచ్చేరు.
🌿2013 జూలై 13వ తేదీన 22.5 కోట్ల ఖర్చుతో వేంకటేశ్వరుని ఆలయ
నిర్మాణం ప్రారంభించారు. రెండు
అంతస్తులు గా నిర్మించిన యీ
ఆలయంలో పై అంతస్తులో
వేంకటేశ్వర స్వామి ,పద్మావతీ దేవి,
ఆండాళ్ కి, గరుడాళ్వార్ లకు ప్రత్యేక సన్నిధులు కట్టబడినవి.
🌸దక్షిణ భాగాన పద్మావతీ దేవి ఉత్తర భాగాన ఆండాళ్ తూర్పు ముఖంగా వున్నారు. ఆలయ క్రింద భాగంలో
2000 వేలమంది భక్తులు
కూర్చుని శ్రీ నివాసుని
కళ్యాణం వీక్షించేందుకు
వీలుగా ,ఒక అందమయిన కళ్యాణమండపం నిర్మించబడింది.
🌸వెంకన్నను దర్శించడానికి, 45 మెట్లు
ఎక్కి వెళ్ళాలి. మెట్లు ఎక్కలేని వయోవృధ్ధులకు లిఫ్ట్ ఏర్పాటు చేశారు.
సముద్ర తీరాన వున్న యీ తిరుమలేశుని ఆలయంలోని బలిపీఠం,
తిరుమల లో వున్న బలిపీఠం ఒకేలా తామరాకు రూపంలో వుంటాయి.
🌿మార్చి మాసం 30వ తేదీకి ముందు నాలగు రోజులు
తరువాత నాలుగు రోజులు , మరియు
సెప్టెంబరు మాస బ్రహ్మోత్సవాల సమయంలో, భగవంతుని మీద సూర్యుని కాంతి పడేలా
యీ ఆలయం నిర్మించబడింది.
🌸వేంకటేశ్వరుని ఆలయం
వున్న తీరం నుండి, వివేకానందుని గుట్ట వళ్ళు వర్ వున్న గుట్ట
స్పష్టంగా కనిపిస్తాయి. తెప్పకుళం , రధ వీధి తిరుమల లో వున్న ట్లే
ఇక్కడ కూడా నిర్మించాలని సంకల్పించారు.
🌿 ఒక వారం కాలం పాటు యాగశాల పూజలు, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు 2019 జనవరి27వ తేదీ ఉదయము న తి.తి.దే ముఖ్య అర్చకులు శేషాద్రి నాయకత్వాన 60 మంది అర్చకులు కుంభాభిషేక పూజలు నిర్వహించారు.
🌸కుంభాభిషేక మునకు
మొదటి రోజు కన్యాకుమారి భగవతి
అమ్మన్ ఆలయమునుండి ,
పట్టువస్త్రాలు, పాలు, తేనె , చందనం మొదలైన అభిషేక వస్తువులను
మేళతాళాలతో తీసుకుని వచ్చి వేంకటేశ్వరునికి సమర్పించారు.
🌿తిరుపతి లడ్డూలు తీసుకుని వచ్చి భక్తులందరికీ పంచారు.
తిరుపతి లో వున్న మూలస్ధాన విగ్రహం
వలెనే యిక్కడ కూడా ఏడుఅడుగుల ఎత్తున వేంకటేశ్వరుని శిలా ప్రతిష్టాపన జరిగింది. మూడు అడుగుల ఎత్తున
పద్మావతీ దేవి శిలావిగ్రహం.
ఆండాళ్ విగ్రాహానికి, గరుడాళ్వార్ విగ్రహానికి కూడా విశేష అలంకారాలు,
పూజలు జరిపారు.
🌸ధ్వజస్థంభం మీద సంప్రదాయక జండా ఎగురవేసి, విశేష పూజలు ఆరాధనలు జరిపి,భక్తుల దర్శనమునకు అనుమతి యిచ్చారు.
🌿ఆ రోజు సాయంకాలం
శ్రీ నివాస కళ్యాణం వైభవంగా జరిపారు. కుంభాభిషేకం రోజున
అనేక మంది భక్తులు విదేశీ భక్తులు స్వామిని దర్శించుకున్నారు..