Business

100 షేర్లకు 300 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.24 లక్షలు చేసిన స్టాక్.. రెండేళ్లలోనే దశ తిరిగింది

100 షేర్లకు 300 షేర్లు ఫ్రీ.. లక్షను రూ.24 లక్షలు చేసిన స్టాక్.. రెండేళ్లలోనే దశ తిరిగింది

స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లను లక్షాధికారుల్ని చేసే స్టాక్స్ ఎన్నో ఉంటాయి. వీటిని కనిపెట్టి ఇన్వెస్టే చేస్తే మంచి లాభాలొస్తాయి. ఇలాగే ఒక స్టాక్ రూ. లక్ష పెట్టుబడిని ఏకంగా రూ.24 లక్షలు చేసింది. బోనస్ షేర్లతోనే దశ తిరిగింది. ఆ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

స్టాక్ మార్కెట్లలో సుదీర్ఘ కాలం ఇన్వెస్ట్ చేసే వారికి కేవలం స్టాక్ ధర పెరగడం వల్ల కలిగి ప్రయోజనాలకు మించి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పొచ్చు. లిస్టెడ్ కంపెనీ తన లాభాల నుంచి ఇన్వెస్టర్లకు అవార్డుల రూపంలో ఏదో ఒకటి ప్రకటిస్తూనే ఉంటుంది. ఇది మధ్యంతర లేదా తుది డివిడెండ్, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్, షేర్ల బైబ్యాక్ ఇలా ఎన్నో రూపాల్లో ఉంటాయి. ఇక కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ ఉంటాయి. ఇవి ఇన్వెస్టర్లకు ఊహించని రీతిలో లాభాలను అందిస్తుంటాయి. అలాంటి ఒక SME స్టాక్ లక్షల్లో లాభం ఇచ్చింది. గత కొన్నేళ్లలో దలాల్ స్ట్రీట్‌లో వచ్చిన మల్టీబ్యాగర్లలో దీని గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అదే EKI Energy Services Limited. గత రెండేళ్లలో చూసుకుంటే ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు ఏకంగా 1150 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

2022 జులైలో ఈ కంపెనీ 3:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే ఒక్కో ఈక్విటీ షేరుకు మరో 3 షేర్లు అదనంగా వచ్చి చేరతాయన్నమాట. అంటే మీ దగ్గర 100 షేర్లు ఉంటే ఆ సంఖ్య ఉచితంగా మొత్తంగా 400 షేర్లు అవుతాయి. ఇక ఈ ఐపీఓ వచ్చినప్పటినుంచి ఏకంగా 1900 శాతం లాభాలను అందించింది.

ఇక 2021 ఏప్రిల్ 7న ఈ ఐపీఓ వచ్చింది. పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ విలువ రూ.100-102 మధ్య ఉంది. ఇక రూ.102 షేరు ధరకు మొత్తం ఒక లాట్‌కు 1200 షేర్లు వచ్చాయి. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్.. 1200 x102 = 1,22,400. ఇక 3:1 బోనస్ షేర్లతో కలిపి మొత్తం 1200×3=3600 అదనంగా ఫ్రీగా వచ్చాయి. దీంతో మొత్తం షేర్లు 4800 అయ్యాయి.

ఇక ప్రస్తుతం ఈ స్టాక్ షేరు ధర రూ.512.75 వద్ద ఉంది. దీంతో మొత్తం 4800 x 512.75 = 24,61,200 అయింది. అంటే లక్షా 22 వేల పెట్టుబడితో.. వచ్చిన మొత్తం లాభం రూ.24 లక్షలకుపైనే. దీంతో ఇందులో రెండేళ్ల కింద డబ్బులు పెట్టిన వారు ఇప్పుడు లక్షాధికారులు అయ్యారు.

అయితే స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. అప్పుడు పెద్దగా నష్టభయం ఉండకపోవచ్చు. నిపుణులు సూచించిన స్టాక్స్‌ను నిశితంగా పరిశీలిస్తూ ఒక క్రమపద్ధతిలో పెట్టుబడులు పెడుతుంటే లాభాలు అందుకోవచ్చు. మార్కెట్లపై అవగాహన పెంచుకోవడం మరవొద్దు. కంపెనీల ఫలితాలు, ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.