Health

పైసా ఖర్చు లేకుండా కంటి చూపును పెంచే అద్భుతమైన అవకాశం ….

పైసా ఖర్చు లేకుండా కంటి చూపును పెంచే అద్భుతమైన అవకాశం ….

ఈ రోజుల్లో కళ్లద్దాలు వాడిని వారు అంటూ ఎవరూ లేరు, అంటే దాదాపు చాలామందికి కూడా ఐ సైట్ వచ్చి కళ్లద్దాలను ధరిస్తున్నారు. కంటి చూపు మందగించడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడే వారికి మనం ఈరోజు యోగా ద్వారా ఎలాంటి పరిష్కారం పొందవచ్చు తెలుసుకుందాం.

మన అందరికీ కళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలావరకు కళ్ల ద్వారా వారి ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎదుటి వ్యక్తులకు తెలియడం జరుగుతుంది మరికొందరికి చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. అయితే మనం ఈరోజుల్లో చాలామంది మొబైల్స్, లాప్టాప్స్, టీవీ చూడడం ఇలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జిఎట్స్ వాటిని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది.

ఐస్ స్ట్రైన్ అనేది చాలా పెరిగింది, దీనివల్ల ప్రతి ఒక్కరికి అంటే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఈ ఐ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కళ్ళు డ్రై అయిపోవడం, సాఫ్ట్వేర్ వంటి జాబులు చేసే వారికి ఈ ప్రాబ్లం చాలా సాధారణంగా అందరికీ ఉంటుంది. ఇలా కాళ్లు డ్రై అయిపోవడం, కళ్ళు దురద రావడం, కళ్ళు నొప్పిగా లాగినట్లుగా అనిపించడం, ఎప్పుడు మత్తుగా ఉండి పడుకోవాలి అనిపించడం, కళ్ళ నుండి నీళ్లు కారడం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి తర్వాత మెల్లమెల్లగా ఐ సైట్ తగ్గిపోవడం లాంటిది జరగడం, ఇంకా ఈ రోజుల్లో చిన్నపిల్లలకి కూడా స్పెడ్స్ పెట్టడం జరుగుతుంది, ఇలా ఐ సైట్ కి అనేక కారణాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఐస్ మనం చదువుకుంటున్నప్పుడు కానీ మనం కూర్చున్నప్పుడు, మనం మనకు ఇష్టం వచ్చిన పొజిషన్లో పడుకోవడం , లాప్టాప్ ఎలా పడితే అలాగా పెట్టుకొని మనకు ఇష్టం వచ్చిన పద్ధతిలో పెట్టుకొని చూడడం ఇలా గంటల తరబడి లాప్టాప్స్ ముందు కూర్చోవడం వల్ల కూడా ఐ సైట్స్ చాలా త్వరగా వస్తాయి. మీరు ఒక పొజిషన్ లో కరెక్ట్ గా కూర్చుని కరెక్ట్ డిస్టెన్స్ లో కూర్చుని ఐస్ కి స్ట్రైన్ ఇవ్వకుండా జాగ్రత్త పడండి. మనం చదువుతున్నప్పుడు లైటింగ్ అనేది కరెక్ట్ గా బుక్ మీద ఫోకస్ అయ్యి ఉండాలి, ముఖ్యంగా పిల్లల స్కూల్లో ఆ బ్లాక్ బోర్డ్ కి లైటింగ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి, వీటన్నిటిని పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడే చూసుకోవాలి అంటే ప్రైమరీ క్లాస్ లోపు ఇవన్నీ సరిగ్గా చూసుకోవాలి. బోర్డుపై లైట్ ఫోకస్ అనేది కరెక్ట్ గా యాంగిల్ లో ఉందా లైటింగ్ అనేది కరెక్ట్ గా ఉందా ఒకవేళ లైటింగ్ సరిగ్గా లేకపోతే పిల్లలు బ్లాక్ బోర్డ్ ను చూసేటప్పుడు ఐస్ ని ఎక్కువ స్ట్రైన్ చేసి చూడాల్సి ఉంటుంది.

ఇలా చేయడం వల్ల ఒక రెండు మూడు సంవత్సరాలకే పిల్లలకు ఐ సైట్స్ రావడం జరుగుతుంది, మనం ఇప్పుడున్న పరిస్థితులలో అందరం అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాం కాబట్టి ఈ అపార్ట్మెంట్స్ లో లైటింగ్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి ఫోకస్ లైట్స్ అనేవి బ్లాక్ బోర్డ్ మీద ఉండేట్లుగా పేరెంట్స్ జాగ్రత్త చూసుకోవాలి. ఆల్రెడీ ఐ సెట్స్ వచ్చిన పిల్లలకి వారి ఐబ్రోస్ ఎడ్జ్ లో పక్కన టు ఫింగర్స్ పెట్టి ఒక 20 టైమ్స్ వరకు టైపింగ్ చేస్తూ ఉండాలి, ఇలా చేసిన తర్వాత అలాగే సర్కిల్ మాదిరిగా మెల్లగా మర్దన చేస్తూ ఉండాలి, ఇలా ఒక 5 నుండి 6 సార్లు చేస్తూ ఉండాలి, అలాగే దాని తర్వాత ఐస్ కింద త్రీ ఫింగర్స్ పెట్టి మెల్లగా ప్రెస్ చేస్తూ ఉండండి, అలాగే మీ ఐబ్రోస్ ని మధ్య భాగంలో కాస్త ప్రెస్ చేస్తూ రిలాక్స్ చేయండి ఇలా రోజుకు 5 నుండి 6 సార్లు చేయండి.