ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. కొట్టాయం జిల్లాలోని చెరువల్లి ఎస్టేట్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం 2,266 ఎకరాలు కేటాయించడంతో పాటు అదనంగా 307 ఎకరాల భూమిని సేకరించనున్నారు. విమానాశ్రయం నిర్మాణం పూర్తయితే.. 3.5 కి.మీ పొడవుతో రాష్ట్రంలోనే అత్యంత పొడవైన విమానాశ్రయంగా నిలవనుంది. ఈ విమానాశ్రయం పూర్తయితే శబరిమలకు ప్రయాణ సమయం తగ్గనుంది.