పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఎస్సీ హాస్టల్లో 8వ తరగతి విద్యార్థి కోటిస్వాములు (13) గుండెపోటుతో మృతి చెందాడు. నిన్న రాత్రి భోజనం చేశాక ఊపిరాడటం లేదని ఫ్రెండ్స్తో చెప్పిన బాలుడు.. కాసేపటికే పడిపోయాడు. వెంటనే బాలుడిని వార్డెన్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది