జీడబ్ల్యూటీసీఎస్ (బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం) ఆధ్వర్యంలో శోభాకృత ఉగాది ఉత్సవాలు అత్యంత ఆహ్లాదకరంగా, మరెంతో రమణీయంగా, అంగరంగవైభవంగా జరిగాయి. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వేద పండితుల ఆశీర్వచనాలతో కార్యక్రమం ప్రారంభమైంది. వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని ప్రవాసాంధ్రులు , ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. విందు, వినోదం, నృత్యం, నాట్యం, సంగీతం, సాహిత్యం మధ్య సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. తెలుగువారి అభిరుచులకు తగ్గట్లుగా పసందైన విందు భోజనాలు ఏర్పాటుచేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని లైవ్ బాండ్ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా సతీష్ వేమన, మన్నవ సుబ్బారావు, మూల్పూరి వెంకట్రావు, డా.హేమప్రసాద్ యడ్ల, స్టేట్ డెలికేట్ సుహాస్ సుబ్రహ్మణ్యం, బుటా బీబీ రాజ్, గంటి భాస్కర్, బాబూరావు సామల, విష్షు కల్వాల, నాగిరెడ్డి, సత్యనారాయణ మన్నె తదితరులు హాజరయ్యారు. ప్రముఖ గాయని శ్రీమతి సునీత ఉపద్రష్ట బృందం తమ పాటలతో ప్రేక్షకులను మైమరపించారు. ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ చేస్తున్న సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. సునీత సినీ నేపథ్య గాయనిగా తన 25 ఏళ్ల ప్రస్థానం పూర్తిచేసుకోవడాన్ని పురస్కరించుకుని ఆమెను ఘనంగా సత్కరించి “సుమధుర సుస్వర సుహాసిని” బిరుదు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా కృష్ణ లాం మాట్లాడుతూ.. అందరికీ శోభాకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భాషను, ఆచార వ్యవహారాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. తీపి, చేదు కలిసిందే జీవితం. ఈ ఉగాది ప్రారంభం నుంచి అందరి జీవితాలు ఆనందమయం కావాలన్నారు. జీడబ్ల్యూటీసీఎస్ లాంటి సుదీర్ఘ చరిత్ర ఉన్న సంస్థకు అతి చిన్న వయసులో నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగువారి అందరికీ వివిధ రూపాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అందజేయాలన్నదే మా అభిలాష. మీరిస్తున్న ప్రోత్సాహం, ఆశీస్సులు మమ్ముల్ని మరింత ఉత్సాహ పరుస్తున్నాయి. మా సంస్థ పట్ల భవిష్యత్ లోనూ ఇలాంటి ఆదరణే చూపాలని కోరుకుంటున్నానన్నారు.
సతీష్ వేమన మాట్లాడుతూ.. ఉగాది కొత్త ఆలోచనలు, సరికొత్త ఆశయాలు మీ జీవితాల్లో నింపాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది ఉగాది పండుగన్నారు.
మూల్పూరి వెంకట్రావు మాట్లాడుతూ.. సంక్రాంతి సంబరాలకు ధీటుగా ఉగాది వేడుకలను నిర్వహించారు. భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు జీడబ్ల్యూటీసీఎస్ ద్వారా చేపట్టాలన్నారు.
ఫ్యాషన్ షోస్, రాఫెల్స్, ఫోటో బూత్స్, కిడ్స్ ఆర్ట్ కాంపిటీషన్, షాపింగ్ స్టాల్స్, డాజ్లింగ్ కల్చరల్ ఫెర్ఫార్మెన్సెస్, వంటి అనేక సాంస్కృతిక, క్రీడా, వినోద కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి.
చిన్నారుల నృత్యం, నాట్యం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులకు, ప్రేక్షకులకు ఈ కార్యక్రమం ఒక మధురానిభూతిని మిగిల్చింది.
ఈ కార్యక్రమంలో నరేన్ కొడాలి, సుశాంత్ మన్నె, విజయ్ అట్లూరి, సుష్మ అమృతలూరి, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, ప్రవీణ్ కొండక, శ్రీనివాస్ గంగా, యాష్ బొద్దులూరి, శ్రీవిద్య సోమ, కార్తీక్ కోమటి, ఫణి తాళ్లూరు, ఉమాకాంత్ రఘుపతి, రాజేష్ కాసరనేని, సుధ పాలడుగు, సత్య సూరపనేని, రమాకాంత్ కోయ, రామ్ చౌదరి ఉప్పుటూరి తదితరులు పాల్గొన్నారు.